T-20 World Cup : సూపర్ -12 స్టేజ్ ముందు శ్రీలంకకు భారీ షాక్.. కొంపముంచిన బయోబబుల్ ..!

Sri Lanka

T-20 World Cup : ఒకసారి బయోబబుల్‌లోకి అడుగుపెట్టే వారికి బయటి ప్రపంచంతో నేరుగా సంబంధాలు తెగిపోతాయి. ప్రతీ ఆటగాడు, కోచింగ్ సిబ్బంది, యాజమాన్యం ప్రత్యేకంగా కేటాయించిన హోటల్ గదుల్లో మాత్రమే ఉండాలి.

 • Share this:
  ప్రపంచాన్ని కరోనా వైరస్ (Corona Virus) అతలాకుతలం చేసేసింది. ప్రతీ దేశంలో కోవిడ్ నిబంధనలు (Covid Restrictions) విధించారు. ఇక గత ఏడాది స్తంభించిపోయిన క్రీడలు.. ఇప్పుడు బయోబబుల్ (Bio Bubble) ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది టీ -20 వరల్డ్ కప్ కూడా బయోబబుల్ లోనే నిర్వహిస్తున్నారు. ఒకసారి బయోబబుల్‌లోకి అడుగుపెట్టే వారికి బయటి ప్రపంచంతో నేరుగా సంబంధాలు తెగిపోతాయి. ప్రతీ ఆటగాడు, కోచింగ్ సిబ్బంది, యాజమాన్యం ప్రత్యేకంగా కేటాయించిన హోటల్ గదుల్లో మాత్రమే ఉండాలి. హోటల్‌లో ఇతరులతో నేరుగా కలవడానికి అనుమతించరు. దీంతో, బయోబబుల్ వల్ల ఆటగాళ్లు మానసికంగా కృంగిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు బయోబబుల్ ఒత్తిడి తట్టుకోలేక చాలా సిరీస్ లు ఆడకుండా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

  ఇప్పుడు ఈ బయోబబుల్ వల్ల టీ20 ప్రపంచకప్ (T20 world cup) లో సూపర్-12 (Super-12 stage) కు చేరిన శ్రీలంక (srilanka) జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. క్వాలిఫైయర్స్ లో అద్భుత విజయాలతో అదరగొట్టిన శ్రీలంక సూపర్-12 కు అర్హత సాధించిన ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. ఆ జట్టు టీమ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్న శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేళ జయవర్ధనే (Mahela Jayawardene).. టోర్నీ మధ్యలోనే నిష్క్రమించాడు.

  సూపర్-12 కు ముందు తాను జట్టును వీడుతున్నట్టు జయవర్ధనే తెలిపాడు. ఏమైనా పనుంటే తాను ఇంటిదగ్గర నుంచి చేస్తాను గానీ ఇక్కడ మాత్రం ఉండలేనని నిష్ర్కమించాడు. సుమారు ఐదు నెలలుగా ఇంటికి దూరంగా ఉన్న జయవర్ధనే.. ఇక బయోబబుల్ లో ఉండటం తన వల్ల కాదని తేల్చి చెప్పేశాడు. వీటి కారణంగా 135 రోజులుగా తన కూతురును చూడలేదని వాపోయాడు.

  ఇది కూడా చదవండి : గత టీ-20 వరల్డ్ కప్ ల్లో పాక్ ను భారత్ ఎలా మట్టికరిపించిందో గుర్తుందా..?

  ఇదే విషయమై జయవర్ధనే స్పందిస్తూ... " ఇది (బయో బబుల్) చాలా కఠినం. జూన్ నుంచి ఇప్పటిదాకా క్వారంటైన్, బయో బబుల్స్ లోనే ఉన్నాను. నేను చాలా రోజులుగా నా కూతురును చూడలేదు. ఆ బాధ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. నేను కచ్చితంగా ఇంటికి వెళ్లాలి " అని తెలిపాడు.

  మహేల జయవర్ధనే


  అయితే బయో బబుల్ నుంచి వెళ్లిపోయినా తాను ఇంటి నుంచి సేవలందిస్తానని జయవర్దనే అన్నాడు. సాంకేతికంగా గానీ, మరేదైనా జట్టు అవసరాల నిమిత్తమైనా తనను సంప్రదించవచ్చునని స్పష్టం చేశాడు. ఐసీసీ టీ20 టోర్నీకి ముందు జయవర్ధనే.. ఇంగ్లండ్ లోని సౌతర్న్ బ్రేవ్స్ కు కోచ్ గా సేవలందించాడు.

  దాని తర్వాత యూఏఈకి వచ్చాడు. అక్కడ ముంబై ఇండియన్స్ కోసం పనిచేశాడు. ఇప్పుడు మళ్లీ వరల్డ్ కప్ కోసం శ్రీలంక జట్టుతో కలిశాడు. కరోనా కారణంగా జయవర్ధనే.. ఏ జట్టుకు కోచ్ గా లేదా సహాయకుడిగా వెళ్లినా అక్కడ క్వారంటైన్,బయో బబుల్ లో ఉండాల్సి వస్తోంది. దీంతో విసిగిపోయిన అతడు.. ఇక తాను ఎంత మాత్రం బయోబుడగలో ఉండలేనని బయటకు వచ్చేశాడు. గత రెండేళ్లుగా శ్రీలంక టీమ్ పరిస్థితి దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు ప్రపంచ చాంపియన్లు ఉన్నా లంకేయులు.. ఇప్పుడు క్వాలిఫైయిర్స్ మ్యాచులు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
  Published by:Sridhar Reddy
  First published: