T-20 World Cup : టీమిండియాతో మెగా ఫైట్ కు ముందు పాకిస్థాన్ జట్టుకు భారీ షాక్..

Pakistan cricket (Twitter)

T-20 World Cup : టీ20 ప్రపంచకప్‌ డ్రాలో ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాకిస్థాన్.. (India Vs Pakistan) అక్టోబర్ 24న తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. అయితే, ఈ కీలక పోరుకు ముందు పాకిస్థాన్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

 • Share this:
  ఐపీఎల్ 2021 సీజన్ (IPL 2021 Season Latest News) చివరి అంకానికి చేరుకుంది. ఇక, ఐపీఎల్ తర్వాత అలరించడానికి టీ-20 ప్రపంచకప్ టోర్నీ (T-20 World Cup 2021) రెడీ అవుతోంది. ఈ మెగా టోర్నీపైన రోజు రోజుకు అభిమానుల్లో ఉత్సుకత పెరుగుతోంది. అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న ఈ ధనాధన్ టోర్నమెంట్‌ కోసం ఇప్పటికే కొన్ని దేశాల జట్లు యుఏఈ చేరుకున్నాయి. ఇక, టీ20 ప్రపంచకప్‌ డ్రాలో ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాకిస్థాన్.. (India Vs Pakistan) అక్టోబర్ 24న తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. దాయాదీల పోరంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తికనబరుస్తోంది. ఇరుదేశాల మధ్య గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. దీంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం వెయ్యి కళ్లుతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ మెగా ఫైట్ కు ముందు దాయాది పాకిస్థాన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

  పాకిస్థాన్ హై పెర్ఫార్మెన్స్ కోచింగ్ చీఫ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్ (Grant Bradburn) తన పదవికి రాజీనామా చేశారు. న్యూజిలాండ్ మాజీ టెస్ట్ క్రికెటర్ బ్రాడ్‌బర్న్ పీసీబీ 3 ఏళ్లు ఒప్పందం చేసుకున్నాడు. అతను సెప్టెంబర్ 2018 నుంచి జూన్ 2020 వరకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా కూడా ఉన్నారు. ఈ బాధ్యత తర్వాత హై పెర్ఫార్మెన్స్ కోచింగ్ చీఫ్ గా నియమితులయ్యారు.

  ఇక, పాకిస్థాన్ బోర్డుకు బ్రాడ్‌బర్న్ కృతజ్ఞతలు తెలుపుతూ.. ఓ ప్రకటన విడుదల చేశాడు. " పాకిస్థాన్ క్రికెట్ తో కలిసి పని చేయడం గర్వించదగ్గ విషయం. అద్భుతమైన జ్ఞాపకాలతో స్వదేశానికి బయలు దేరుతున్నాను. గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు పీసీబీ థ్యాంక్స్ " అని తెలిపారు గ్రాంట్.

  Grant Bradburn


  అయితే, పీసీబీ ఛైర్మన్ గా రమీజ్ రాజా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పదవీ విరమణ చేసిన ఐదో కీలక వ్యక్తి బ్రాండ్ బర్న్. అతని కంటే ముందు పాకిస్థాన్ హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్, సీఈఓ వసీం ఖాన్ లతో పాటు మార్కెటింగ్ హెడ్ బాబర్ హమీద్ కూడా రాజీనామా చేశారు.

  ఇది కూడా చదవండి : కోల్‌కతా రాత మార్చిన మొనగాడు అతడు..! అందుకే టీ20 వరల్డ్ కప్ కోసం పిలుపు..

  తన కుటుంబంతో సంతోషంగా గడపడానికే బ్రాడ్ బర్న్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా కాలంలో తన భార్య పిల్లలకి దూరంగా ఉన్నారు బ్రాడ్ బర్న్. దీంతో తన కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడమే తన బాధ్యత అని ఆయన తెలిపారు. కానీ, రమీజ్ రాజా ఒత్తిడి తట్టుకోలేక బ్రాడ్ బర్న్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

  ఇది కూడా చదవండి : పాక్ జట్టును టీజ్ చేస్తోన్న మౌకా మౌకా యాడ్..! భారత్ ఫ్యాన్స్ కు పండుగే..

  బ్రాడ్ బర్న్ 1990 నుంచి 2001 వరకు న్యూజిలాండ్ తరఫున 7 టెస్ట్ లు మరియు 11 వన్డేలు ఆడాడు. ఆఫ్ స్పిన్ బౌలర్ అతడు. ఆ తర్వాత న్యూజిలాండ్- ఏ, న్యూజిలాండ్ అండర్ -19 జట్లకు కోచ్ గా పనిచేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ నిర్వహిస్తున్న అన్ని హై పెర్ఫార్మెన్స్ సెంటర్లలో పనిచేసే సహాయక సిబ్బందికి శిక్షణ స్థాయిని పెంచే బాధ్యతను అతనికి అప్పగించారు.
  Published by:Sridhar Reddy
  First published: