Ind Vs Pak : టీమిండియాతో బిగ్ ఫైట్ కు ముందు పాక్ కు ఝలక్.. దాయాది కాన్ఫిడెన్స్ పై దెబ్బ..!

Pakistan cricket (Twitter)

Ind Vs Pak : పొట్టి టోర్నిలో హై ఓల్టేజ్ మ్యాచ్ అక్టోబర్ 24న జరగనుంది. దాయాది దేశాలు పాకిస్తాన్, భారత్ (India Vs Pakistan) జట్లు వచ్చే ఆదివారం తలపడనున్నాయి. ఈ బ్లాక్ బస్టర్ పోరు కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

 • Share this:
  టీ20 ప్రపంచకప్‌ 2021 (T-20 World Cup 2021) మొదలైనప్పటి నుంచి ఫ్యాన్స్ కు కావాల్సిన మజా అందిస్తోంది. క్వాలిఫైయిర్స్ మ్యాచ్ ల్లో చిన్న జట్లు కూడా తమదైన ముద్ర వేస్తున్నాయ్. ఇక, వార్మప్ మ్యాచ్ లు కూడా ఫ్యాన్స్ కు కావాల్సిన బోలెడంత కిక్ ని అందిస్తున్నాయ్. ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో విజయం సాధించి కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంటున్నాయ్ పెద్ద జట్లు. ఇక ప్రపంచకప్‌ సూపర్ 12 స్టేజ్ (Super-12 Games) ఈనెల 23న ఆరంభం కానుంది. పొట్టి టోర్నిలో హై ఓల్టేజ్ మ్యాచ్ అక్టోబర్ 24న జరగనుంది. దాయాది దేశాలు పాకిస్తాన్, భారత్ (India Vs Pakistan) జట్లు వచ్చే ఆదివారం తలపడనున్నాయి. ఈ బ్లాక్ బస్టర్ పోరు కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, భారత్ తో జరగనున్న మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ జట్టుకు దిమ్మదిరిగే షాక్ తగిలింది.

  దక్షిణాఫ్రికా (South Africa)తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో భారీ స్కోర్ చేసినా పాక్ జట్టుకు ఓటమి తప్పలేదు. స్టార్ పేసర్ హాసన్ అలీ (Hasan ALi) చేజేతులారా మ్యాచును పోగొట్టాడు. దక్షిణాఫ్రికా విజయానికి చివరి రెండు ఓవర్లలో 29 పరుగులు అవసరం అయ్యాయి. 19వ ఓవర్ వేసిన షహీన్ షా అఫ్రిది.. 10 పరుగులు ఇచ్చాడు.

  అఫ్రిది రెండు ఫోర్లు ఇచ్చినా.. అవి బ్యాట్ అంచును తాకి అనూహ్యంగా బౌండరీ వెళ్లాయి. ఇక చివరి ఓవర్లో ప్రొటీస్ విజయానికి 19 పరుగులు అవసరం అవ్వడంతో పాక్ విజయం ఖాయం అనుకున్నారు. కానీ బంతిని అందుకున్న హాసన్ అలీ ఏకంగా 22 పరుగులు ఇచ్చాడు. అలీ రెండు సిక్సులు, రెండు ఫోర్లు ఇచ్చి పాక్ ఓటమికి కారకుడయ్యాడు.

  టీమిండియాతో మ్యాచుకు ముందు పాకిస్తాన్ ఇలా ఓడిపోవడంతో ఆ జట్టు ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. సోషల్ మీడియాలో పాక్ జట్టును నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. " బాబర్ ఆజామ్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు " అని ఒకరు కామెంట్ చేయగా.. " 19 పరుగులను కూడా కాపాడలేకపోయిన కెప్టెన్ " మరొకరు కామెంట్ చేశారు.

  వాన్‌డెర్‌ డుసెన్‌ (51 బంతుల్లో 101 నాటౌట్‌) సెంచరీ చేయడంతో ఆఖరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్ 20 ఓవర్లలో 186/6 స్కోరు చేసింది. ఫఖర్‌ జమాన్‌ (51), ఆసిఫ్‌ అలీ (32) రాణించారు. రబాడ (3/28) మూడు వికెట్లు పడగొట్టాడు.

  ఇది కూడా చదవండి : ఈ ఇద్దరు పాకిస్థాన్ క్రికెటర్ల భార్యలు భారత దేశానికి చెందిన వారు..! వారెవరో తెలుసా..?

  టార్గెట్ చేజింగ్ లో దక్షిణాఫ్రికా 190/4 స్కోరు చేసి గెలిచింది. మరోవైపు, టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో అదరగొట్టి.. కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది. ఫస్ట్ వార్మప్ లో ఇంగ్లండ్ ను ఓడించినా టీమిండియా.. రెండో ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జోరుకు చెక్ పెట్టింది. టీమిండియా బ్యాటర్లు, బౌలర్లందరూ.. ఈ రెండు మ్యాచ్ ల్లో ప్రాక్టీస్ ను సద్వినియోగం చేసుకున్నారు.

  ఇది కూడా చదవండి : ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ సారా టేలర్ ను పెళ్లి చేసుకోవాలనుకున్న కోహ్లీ..! ఆమె కోసం ఏం చేశాడంటే..

  ఇదే, ఫామ్ ను పాక్ తో జరిగే పోరులో చూపిస్తే.. దాయాది మెగా ఈవెంట్స్ లో మరో ఓటమి తప్పదు. ఇప్పటికే మెగా టోర్నీల్లో 12-0 అజేయ రికార్డు టీమిండియాకు సొంతం. టీమిండియాలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లు ఫామ్ లో ఉండటం టీమిండియాకు ప్లస్ పాయింట్ కానుంది.
  Published by:Sridhar Reddy
  First published: