దేశవాళీ టోర్నీలో పృథ్వీ షా (Prithivi Shaw) అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. T20 ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq ali Trophy 2022-23) మ్యాచ్‌లో అతను శుక్రవారం అస్సాంపై సెంచరీ చేశాడు. అతని టీ20 కెరీర్లో ఇదే తొలి సెంచరీ. అంతకుముందు, అతను ఖాతాలో 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 99 పరుగులు పృథ్వీ షా అత్యధిక స్కోరు. 22 ఏళ్ల షా కేవలం 46 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 10 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. అంటే 16 బౌండరీలు బాదాడు. చివరికి 61 బంతుల్లో 134 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఓవరాల్ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. ఈ విధంగా మరోసారి టీమ్ ఇండియాకు, బీసీసీఐకి తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు. పృథ్వీ షా దూకుడుతో అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఈ మ్యాచ్‌లో అస్సాం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ముంబై బాగానే రాణించింది. అయితే, 7 బంతుల్లో 15 పరుగులు చేసి అమన్ ఖాన్ తొలి వికెట్ గా ఔటయ్యాడు. దీని తర్వాత పృథ్వీ షా, మరో యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ సెంచరీ భాగస్వామ్యంతో ముంబైని భారీ స్కోరు దిశగా నడిపించారు. ఆ తర్వాత 30 బంతుల్లో 42 పరుగులు చేసిన యశస్వి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. ఆఖర్లో సర్ఫరాజ్ ఖాన్ 15, శివమ్ దూబే 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
తొలి మ్యాచ్‌లో 55 పరుగులు చేశాడు
ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రస్తుత సీజన్ అక్టోబర్ 11న ప్రారంభమైంది. మిజోరామ్తో జరిగిన తొలి మ్యాచ్‌లో పృథ్వీ షా అజేయంగా 55 పరుగులు చేశాడు. అతను 34 బంతులు ఎదుర్కొన్నాడు. 9 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. రెండో మ్యాచ్‌లో ఎంపీపై 29 పరుగులు చేసి ఇప్పుడు సెంచరీ చేశాడు. దీంతో.. తన స్టామినా ఏంటో బీసీసీఐకి చూపించాడు. ఇటీవల బీసీసీఐపై పరోక్షంగా పృథ్వీ షా సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే.
Maiden hundred for Captain Prithvi Shaw in T20 format, hundred from 46 balls including 10 fours and 6 sixes, A knock to remember, What a player. pic.twitter.com/bokhoHDAPQ
— Johns. (@CricCrazyJohns) October 14, 2022
టీమిండియా - సౌతాఫ్రికా వన్డే సిరీస్ ఎంపిక చేసినప్పుడు తన పేరు లేకపోవడంతో బాధపడ్డ పృథ్వీ షా.. వారి మాటల్ని ఎవరు నమ్మద్దు.. ఇచ్చిన మాటను తప్పుతారు అంటూ పరోక్షంగా బీసీసీఐని కార్నర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు, పృథ్వీ షా 84 టీ20 మ్యాచ్‌ల్లో 26 సగటుతో 2153 పరుగులు చేశాడు. 18 అర్ధ సెంచరీలు చేశాడు. స్ట్రైక్ రేట్ 149, ఇది టీ20 పరంగా అద్భుతమైనది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా మంచి ప్రదర్శన చేస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Cricket, Prithvi shaw, Team India