Home /News /sports /

SYED MUSTAQ ALI BIRTH ANNIVERSARY FIRST INDIAN PLAYER TO HIT A CENTURY ON FOREIGN SOIL JNK

Team India: విదేశీ గడ్డపై సెంచరీ బాదిన తొలి భారత క్రికెటర్ ఎవరో తెలుసా? అతడి పేరు మీద ఒక టోర్నమెంట్ కూడా ఉంది..!

విదేశీ గడ్డపై సెంచరీ చేసిన తొలి టీమ్ ఇండియా క్రికెటర్ ఎవరో తెలుసా?

విదేశీ గడ్డపై సెంచరీ చేసిన తొలి టీమ్ ఇండియా క్రికెటర్ ఎవరో తెలుసా?

Team India: విదేశీ గడ్డపై సెంచరీ బాదిన తొలి క్రికెట్ ఎవరో తెలుసా? సుదీర్ఘ కాలం దేశవాళీ క్రికెట్ ఆడినా అంతర్జాతీయ స్థాయిలో మాత్రం కేవలం 11 టెస్టులో ఆడాడు. అయితే అందులో 2 సెంచరీలు ఉన్నాయి. విదేశీ గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్రలో నిలిచిపోయిన అతడి పేరే సయ్యద్ ముస్తాక్ అలీ.

ఇంకా చదవండి ...
    టీమ్ ఇండియా (Team India) విదేశీ పర్యటనలకు (Foreign Tour)  వెళ్లి విజయాలు సాధించడం ఈ మధ్యనే అలవాటు చేసుకుంది. గతంలో భారత జట్టు ఏ పర్యటనకు వెళ్లినా ఓటమలు వెంటాడుతుండేవి. ఇక వ్యక్తిగత సెంచరీలు కొట్టడం అనేది బౌన్సీ విదేశీ పిచ్‌లపై చాలా కష్టం. టీమ్ ఇండియా ఎప్పటి నుంచో టెస్ట్ క్రికెట్ ఆడుతున్నది. అయితే మొదటి సారి విదేశీ గడ్డపై సెంచరీ చేసిన ఘనత మాత్రం సయ్యద్ ముస్తాక్ అలీకి (Syed Mustaq Ali) దక్కింది. ఇవాళ ఆ లెజండరీ క్రికెటర్ పుట్టిన రోజు. ఆయన బతికి ఉండుంటే నేటికి 107 ఏళ్లు నిండేవి. సయ్యద్ ముస్తాక్ అలీ 1936 జులై 25న మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లాండ్‌పై (England) 112 పరుగులు చేశాడు. ఒక టీమ్ ఇండియా బ్యాటర్ విదేశీ గడ్డపై సెంచరీ (Century) చేయడం అదే తొలిసారి. అప్పట్లో అలీని విధ్వంసకర బ్యాటర్‌గా అభివర్ణించే వాళ్లు. టెస్టు క్రికెట్‌లో దూకుడైన బ్యాటింగ్‌ను చూపించిన మొదటి ఆటగాడు కూడా అలీనే. అందుకే బీసీసీఐ అతడి స్మారకంగా దేశవాళీలో 'సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ'ని నిర్వహిస్తున్నది.

    సయ్యద్ ముస్తాక్ అలీ 1914 డిసెంబర్ 17న ఇండోర్‌లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. అప్పట్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్న కల్నల్ సీకే నాయుడు తొలి సారిగా అలీ ప్రతిభను గుర్తించి జట్టులో చోటు దక్కేలా చేశాడు. అందుకే అలీ తన గురువుగా సీకే నాయుడు పేరు చెబుతుంటాడు. అలీ క్రికెట్ కెరీర్ ప్రారంభించినప్పుడు ఒక పో లెఫ్ట్ ఆర్మ బౌలర్‌గా ఉండేవాడు. కానీ ఆ తర్వాత కాలంలో ఒక విధ్వంసకర ఓపెనింగ్ బ్యాటర్‌గా మారిపోయాడు. 1934లో కోల్‌కతా ఈడెన్ గార్డెన్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలి సారి టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అప్పుడు అలీ వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే. రెండేళ్ల తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి అక్కడ సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.

    Lesbian Sports Persons: ప్రపంచంలోని పాపులర్ లెస్బియన్ క్రీడాకారిణులు వీరే.. వివక్ష నుంచి విజేతలుగా..




    సయ్యద్ ముస్తాక్ అలీ (ఫైల్ ఫొటో)


    1936 జులై 25న మాంచెస్టర్ వేదికగా జరిగిన టెస్టులో ఇండియా - ఇంగ్లాండ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో మరో ప్రముఖ బ్యాటర్ విజయ్ మర్చంట్‌తో కలసి అలీ 140 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ కలసి 203 పరుగులు జోడించారు. అయితే అందులో 112 పరుగులు అలీ చేసినవే. అలీ కెరీర్‌లో ఇదే అత్యధిక పరుగులుగా నిలిచిపోయాయి. మొత్తం 150 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన అలీ 17 ఫోర్లతో టెస్టు సెంచరీ సాధించాడు.

    IND vs SA: దక్షిణాఫ్రికా చేరుకున్న టీమ్ ఇండియా.. సఫారీ గడ్డపై చర్రిత సృష్టించాలనే పట్టుదలతో విరాట్ కోహ్లీ


    అలీ కెరీర్‌లో 11 టెస్టుల్లో 20 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. 32.21 సగటుతో మొత్తం 612 పరుగులు ఉన్నాయి. అతను మొత్తం రెండు సెంచరీలు, మూడు అర్దసెంచరీలు బాదాడు. ఇంగ్లాండ్‌తోనే 1952లో అలీ చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. అలీ కెరీర్‌లో ఆడిన చివరి టెస్టులో భారత జట్టు తొలి టెస్టు విజయం అందుకోవడం విశేషం.

    IPL: సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా ప్రక్షాళన.. కోచింగ్ స్టాఫ్‌తో మొదలు పెట్టిన యాజమాన్యం.. ఏయే మార్పులు చేస్తోందంటే..



     ఇక ముస్తాక్ అలీ 1930-31 సీజన్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అప్పటికి కేవలం 16 ఏళ్లు మాత్రమే. అలీ 30 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్ కొనసాగించి తన 49వ ఏట 1963-64లో చివరి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ 226 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 35.9 సగటుతో 13213 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అలీ పేరిట 30 సెంచరీలు ఉన్నాయి. దీంతో పాటు 63 హాఫ్ సెంచరీలు కూడా అలీ నమోదు చేశాడు. క్రికెట్‌కు అలీ చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1964లో 'పద్మశ్రీ' అవార్డుతో సత్కరించింది. 2005 జూన్ 18న అలీ 91వ ఏట ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికి వెళ్లిపోయారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: Cricket, Team india, Test Cricket

    తదుపరి వార్తలు