Home /News /sports /

SYED MUSHTAQ ALI TROPHY SREESANTH SLEDGES YASHASVI JAISWAL HE GIVES REPLY WITH SIXES SK

Sreesanth VS Yashasvi Jaiswal: శ్రీశాంత్‌ను ఆటాడుకున్న యశస్వి.. స్లెడ్జింగ్ చేస్తావా అటాక్.. వీడియో వైరల్

శ్రీశాంత్, యశస్వి జైశ్వాల్

శ్రీశాంత్, యశస్వి జైశ్వాల్

Sreesanth VS Yashasvi Jaiswal: తన కన్నా రెట్టింపు వయసున్న శ్రీశాంత్‌కు ఇలా ఊహించని కౌంటర్ ఇచ్చాడు యశస్వి. తన బ్యాటింగ్‌తో అటాక్ చేసి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    Syed Mushtaq Ali Trophy 2020-21: సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీ 2020-21 టోర్నమెంట్ రసవత్తరంగా జరుగుతోంది. ఐతే జనవరి 13న ముంబై, కేరళ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. ఐపీఎల్‌లో సూర్యకుమార్ యాదవ్‌ని విరాట్ కొహ్లీ రెచ్చగొట్టినట్లే... ఈ మ్యాచ్‌లో యశస్వి జైశ్వాల్‌ను వెటరన్ బౌలర్ శ్రీశాంత్ రెచ్చగొట్టాడు. 37 ఏళ్ల శ్రీశాంత్.. తన కన్నా వయసులో చిన్నవాడైన 19 ఏళ్ల యశస్విని స్లెడ్జింగ్ చేశాడు. కానీ అతడి కవ్వింపులకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు యశస్వి. సిక్స్‌లతో విరుచుకుపడి శ్రీశాంత్‌కు పట్టపగలే చుక్కలు చూపించాడు. కేరళ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 6వ ఓవర్లలో ఈ ఘటన జరిగింది.

    ఐదు ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై టీమ్ వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. 6ఓవర్‌కు శ్రీశాంత్ బంతిని అందుకున్నాడు. ఆ సమయంలో క్రీజులో యశస్వి జైశ్వాల్ ఉన్నాడు. ఫస్ట్‌బాల్‌ను ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ వేశాడు శ్రీశాంత్. దాన్ని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి యశస్వి విఫలమయ్యాడు. అనంతరం యశస్వి దగ్గరకు వచ్చిన శ్రీశాంత్.. ఏదో అంటూ స్లెడ్జింగ్ చేశాడు. యశస్వి మాత్రం సెలైంట్‌గానే ఉన్నాడు. బ్యాటింగ్‌తోనే ధీటైన సమాధానం చెప్పాడు. శ్రీశాంత్ వేసిన ఆ తర్వాతి బంతిని సిక్సర్ కొట్టాడు. మూడో బంతి కూడా సిక్స్ పడింది. ఆ భారీ సిక్సర్లను చూసి ఖంగుతిన్న శ్రీశాంత్.. యశస్వి ప్యాడ్‌లపైకి బంతులు వేశాడు. కానీ దాన్ని కూడా స్మార్ట్‌గా ఆడి బౌండరీకి తరలించాడు. తన కన్నా రెట్టింపు వయసున్న శ్రీశాంత్‌కు ఇలా ఊహించని కౌంటర్ ఇచ్చాడు యశస్వి. తన బ్యాటింగ్‌తో అటాక్ చేసి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఈ మ్యాచ్‌లో ముంబై 197 పరుగులు చేయగా.. ఆ టార్గెట్‌ను కేరళ ఛేదించింది. కేరళ బ్యాట్స్‌మెన్ మహమ్మద్ అజారుద్దీన్ చెలరేగిపోయాడు. 37 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తం 54 బంతుల్లో 137 పరుగులు చేశాడు అజారుద్దీన్. 11 సిక్స్‌లు, 9 ఫోర్లతో ముంబై బౌలర్లను ఆటాడుకున్నాడు. అతడు విజృంభించడంతో కేరళ ఖాతాలో మరో విజయం నమోదయింది. కాగా, టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్‌ ఏడేళ్ల తర్వాత మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌తో పాటు అజిత్ చండీలా, అంకిత్ చవాన్ అరెస్ట్ అయ్యారు. అనంతరం అతడిపై బీసీసీఐ నిషేధం విధించింది. ఇటీవల శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేడయంతో మళ్లీ గ్రౌండ్‌లోకి దిగాడు శ్రీశాంత్.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cricket, Sports, Sreesanth, Yashasvi Jaiswal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు