Arjun Tendulkar : సచిన్ తనయుడి దాదాగిరి మామూలుగా లేదుగా.. హైదరాబాద్ కు పట్ట పగలే చుక్కలు చూపించాడు
Arjun Tendulkar : సచిన్ తనయుడి దాదాగిరి మామూలుగా లేదుగా.. హైదరాబాద్ కు పట్ట పగలే చుక్కలు చూపించాడు
PC : TWITTER
Arjun Tendulkar : సచిన్ టెండూల్కర్ తనయుడు అనే ట్యాగ్ అతడిపై అంచనాలను భారీగా పెంచేసింది. తండ్రి అడుగు జాడల్లో అర్జున్ కూడా క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు. 23 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు క్రికెట్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శన అయితే చేయలేదు.
తండ్రి క్రికెట్ దేవుడు.. ఐపీఎల్ (IPL) సక్సెస్ ఫుల్ టీం ముంబై ఇండియన్స్ (Mumbai Indians)లో సభ్యుడు. అయినా కూడా అర్జున్ టెండూల్కర్ క్రికెట్ లో ఇప్పటి వరకు తన మార్కును చూపించలేకపోయాడు.
సచిన్ టెండూల్కర్ తనయుడు అనే ట్యాగ్ అతడిపై అంచనాలను భారీగా పెంచేసింది. తండ్రి అడుగు జాడల్లో అర్జున్ కూడా క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు. 23 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు క్రికెట్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శన అయితే చేయలేదు.
అయితే తాజాగా ముంబై రంజీ జట్టును వీడిన అర్జున్.. గోవా తరఫున ఆడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు తన మార్కు ఆటను ప్రదర్శించాడు.
ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో రెచ్చిపోయాడు. పట్టపగలే ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 4 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇందులో ఒక మెయిడీన్ కూడా ఉంది.
అర్జున్ నిప్పులు చెరిగే బంతులను ప్రత్యర్థి బ్యాటర్లు డిఫెన్స్ ఆడేందుకే మొగ్గు చూపారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు అర్జున్ టెండూల్కర్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే.
అయితే ఈ మ్యాచ్ లో అర్జున్ మినహా మిగిలిన గోవా బౌలర్స్ రాణించలేదు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. అర్జున్‌కు నాలుగు వికెట్లకు తోడుగా.. దర్శన్ మిసాల్ ఒక్కడే ఒక వికెట్ తీసాడు.
గూగుల్ తెలుగు వార్తలు, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, తెలంగాణ వార్తలు, పాకిస్తాన్, బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్" width='100%' height="1600" /> తిలక్ వర్మ 46 బంతుల్లో 62 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉండటం విశేషం. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ 41 బంతుల్లో 55 పరుగులు చేశాడు.
అనంతరం గోవా 18.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. బౌలింగ్ లో రాణించిన అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్ లో మాత్రం నిరాశ పరిచాడు. 9వ నంబర్ లో బ్యాటింగ్ కు దిగిన అతడు 3 బంతులను మాత్రమే ఎదుర్కొని 2 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.