సీరియస్‌గా మ్యాచ్ జరుగుతోంది.. దక్షిణాఫ్రికా బౌలర్లు శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెడుతుంటే.. వికెట్లు కాపాడుకోవడానికి లంక క్రికెటర్లు అష్టకష్టాలు పడుతున్నారు.. అప్పుడే అనుకోని అతిథులు వచ్చి మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగించాయి. ఒక్కసారిగా మైదానంలోకి తేనేటీగల గుంపు దూసుకు వచ్చింది. దీంతో షాకైన క్రికెటర్లు, అంపైర్లు.. వెంటనే తేరుకొని అక్కడే పడుకున్నారు. తలకు చేతులు అడ్డం పెట్టుకొని తేనెటీగలు కుట్టకుండా జాగ్రత్త పడ్డారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. 2017లో కూడా శ్రీలంక-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లోనూ ఇలానే జరిగింది. అప్పుడు కూడా తేనెటీగలు మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగించాయి.
ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌లో శ్రీలంక 203 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 2, క్రిస్ మోరిస్ 3, ప్రిటోరియస్ 3 వికెట్లు తీశారు. లంక బ్యాట్స్‌మెన్ ఏ ఒక్కరూ 30 పరుగులకు మించి చేయక పోవడం గమనార్హం.
Bees two nations have a history!#SLvSA | #CWC19 pic.twitter.com/rEY9T7yhUD
— Cricket World Cup (@cricketworldcup) June 28, 2019
BEEEEWARE 🐝 https://t.co/CuyshvsXJM
— Cricket World Cup (@cricketworldcup) June 28, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ICC, ICC Cricket World Cup 2019, South Africa, Sri Lanka