Sushil Kumar : సుశీల్ కుమార్ పై కుట్ర జరిగింది..కావాలనే కేసులో ఇరికించారు..

సుశీల్ కుమార్

Sushil Kumar : ఛత్రాసాల్ స్టేడియంలో మే 4న జరిగిన గొడవలో యువ రెజ్లర్​ సాగర్ రాణా మృతి చెందడంతో అతడి హత్యతో సుశీల్​కు సంబంధముందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా సుశీల్ తప్పించుకొని తిరిగాడు. దీంతో అతడిపై ఢిల్లీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వివిధ రాష్ట్రాల్లో గాలించారు. మొత్తంగా 19 రోజుల పాటు కళ్లుగప్పి తిరిగిన సుశీల్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

 • Share this:
  రెండు వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు సాధించిన భారత ఏకైక అథ్లెట్​, స్టార్ రెజ్లర్​ సుశీల్ కుమార్..(Sushil Kumar) హత్య కేసు ఆరోపణలతో అరెస్టయ్యాడు. ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియంలో మే 4న జరిగిన గొడవలో యువ రెజ్లర్​ సాగర్ రాణా మృతి చెందడంతో అతడి హత్యతో సుశీల్​కు సంబంధముందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా సుశీల్ తప్పించుకొని తిరిగాడు. దీంతో అతడిపై ఢిల్లీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వివధ రాష్ట్రాల్లో గాలించారు. మొత్తంగా 19 రోజుల పాటు కళ్లుగప్పి తిరిగిన సుశీల్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అయితే, స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ను హత్య కేసులో కొందరు కావాలనే ఇరికించారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని అతని తరఫు లాయర్ బీఎస్ జాఖడ్ అన్నారు.ఈ హత్యకేసు మొత్తం ఎపిసోడ్‌లో పోలీసులు వ్యవహరించిన తీరుపై తమకు పలు అనుమానాలున్నాయని చెప్పారు. సుశీల్ నేరం చేశాడనేందుకు వీడియో ఫుటేజ్ ఆధారమని చెబుతున్నారని, కానీ పోలీసులు చూపుతున్న ఫుటేజ్‌లో సుశీల్ జాడలేదని జాఖర్ వెల్లడించారు. పోలీసు దర్యాప్తు జరుగుతున్న తీరును ప్రశ్నించిన ఆయన, సుశీల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని, తాము చెప్పదల్చుకున్న అన్ని విషయాలను ఇప్పటికే కోర్టు ముందు ఉంచినట్లు స్పష్టం చేశారు.

  "పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోనే తప్పులు ఉన్నాయి. ఘటన గురించి తెలిశాక ఛత్రశాల్‌ స్టేడియానికి వెళ్లి గాయపడిన ముగ్గురి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయగా వారెవరూ సుశీల్‌ దాడి చేసినట్లుగా చెప్పలేదు. కానీ సాగర్‌ చనిపోయాక మాత్రమే కిడ్నాపింగ్, మర్డర్‌ కేసు పెట్టారు. సుశీల్‌ కొట్టినట్లుగా చెబుతున్న వీడియోను అందరి ముందు బహిర్గతపర్చవచ్చు కదా. విచారణకు హాజరయ్యేందుకు నోటీసు కూడా సుశీల్‌ పేరిట కాకుండా అతని భార్య పేరిట పంపించడం నిబంధనలకు విరుద్ధం. ఇదంతా చూస్తుంటే సుశీల్‌పై కావాలనే కుట్ర చేసినట్లు అర్థమవుతోంది" అని జాఖర్ వివరించారు.

  అంతేకాక సుశీల్‌పై పది రోజుల్లోపే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారని, పెద్ద పెద్ద గ్యాంగ్‌స్టర్స్ విషయంలో కూడా ఎప్పుడూ ఇలా జరగలేదని జాఖర్ చెప్పారు. దీన్ని బట్టి ఈ కేసులో సుశీల్‌ను ఇరికించడంలో పోలీసులు అత్యుత్సాహాన్ని అర్థం చేసుకోవ్చన్నారు. అయితే తప్పుచేయని సుశీల్ 10 రోజులు ఎందుకు పరారీలో ఉన్నాడనే ప్రశ్నకు జాఖర్ బదులివ్వలేదు. మరోవైపు, ఇండియన్ ఒలింపిక్ సంఘం ప్రెసిడెండ్ నరీందర్ బాత్రా సుశీల్ చాలా నెమ్మదస్తుడని.. తనకు తెలిసినంతవరకు అందర్నీ గౌరవిస్తాడని చెప్పుకొచ్చారు.
  Published by:Sridhar Reddy
  First published: