హోమ్ /వార్తలు /క్రీడలు /

Susheel Kumar: సుశీల్ కుమార్ గొంతెమ్మ కోరికలు..? కుదరదన్న జైలు అధికారులు.. కోర్టులో పిటిషన్

Susheel Kumar: సుశీల్ కుమార్ గొంతెమ్మ కోరికలు..? కుదరదన్న జైలు అధికారులు.. కోర్టులో పిటిషన్

రెజ్లర్ సుశీల్‌కు జైలు ఫుడ్ వద్దంటా..!

రెజ్లర్ సుశీల్‌కు జైలు ఫుడ్ వద్దంటా..!

హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ జైలు అధికారులను తన డైట్ ప్లాన్ వివరించాడు. అయితే కోర్టులో పిటిషన్ వేయాలని చెప్పడంతో శనివారం తనకు కావల్సిన డైట్ ఏమిటో పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశాడు.

  యువ రెజ్లర్ సాగర్ దండక్ (Sagar Dhandak) హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ (Susheel Kumar) ప్రస్తుతం 9 రోజుల జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నాడు. అంతకు ముందు దాదాపు 10 రోజులు పోలీసు కష్టడీలో నోరు విప్పని సుశీల్.. జ్యుడీషియల్ కస్టడీలో మాత్రం జైలు అధికారుల ముందు నోరు విప్పాడు. అయితే కేసు గురించిన వివరాలు చెప్పడానికి కాకుండా తన గొంతెమ్మ కోరికలు తెలియజేయడానికి సుశీల్ మాట్లాడాడు. తనకు జైల్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్‌తో (Protein rich Food) పాటు ఇతర డైట్ సప్లిమెంట్స్ (Diet Supplements) కావాలని జైలు అధికారులను డిమాండ్ చేశాడు. అయితే తమకు సదరు ఆహార పదార్థాలు అందించే అధికారం లేదని చెప్పడంతో సుశీల్ కుమార్ కోర్టులో పిటిషన్ వేశాడు. ఢిల్లీలోని రోహిణి కోర్టులో శనివారం సుశీల్ కుమార్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తున్నది. 'తాను ఒక రెజ్లర్‌ను. తప్పు కేసులో తనను ఇరికించి పోలీసులు అరెస్టు చేశారు. దీని వల్ల నా కెరీర్ నాశనం అవుతున్నది. నా శరీరాన్నీ ఫిట్‌గా ఉంచుకోవాలంటే నాకు ప్రోటీన్ రిచ్ ఫుడ్‌తో పాటు ఇతర డైట్ సప్లిమెంట్లు అవసరం. కాబట్టి అవి తీసుకునేలా నాకు అనుమతి మంజూరు చేయండి' అని పిటిషన్‌లో కోరాడు. అంతే కాకుండా సుశీల్‌కు ఏమేమి ఆహారం కావాలో కూడా కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో స్పష్టంగా పేర్కొన్నాడు.

  సుశీల్ సమర్పించిన పిటిషన్‌లోతనకు ప్రతీ రోజు ఐసోలేట్ వీ ప్రోటీన్, ఒమేగా 3 క్యాప్సుల్స్, జాయింట్‌మెంట్ క్యాప్సుల్స్, ప్రీ వర్కవుట్ సీ4, హైడ్, మల్టీవిటమిన్ జీఎన్‌సీ, వ్యాయామం చేసే బ్యాండ్స్‌తో పాటు ఇతర రెగ్యులర్ ఫుట్ కావాలని కోరాడు. తాను ఆటను ఇంకా కొనసాగిస్తున్నాను కాబట్టి ప్రతీ రోజు ఈ ఫుడ్ తీసుకుంటున్నాను. ఇది నా బేసిక్ మెనూ మాత్రమే అని దీన్ని నేను రోజూ తీసుకోకపోతే తన కెరీర్‌పై ప్రభావం పడుతుందని సుశీల్ కోర్టుకు విన్నవించాడు. తాను బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన విషయాన్ని కూడా పిటిషన్‌లో పేర్కొన్నాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించినట్లు చెప్పాడు. కాగా కోర్టు ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపే అవకాశం ఉన్నది.


  యువ రెజ్లర్ సాగర్ దండక్, అతడి స్నేహితులపై సుశీల్ కుమార్ అతడి అనుచరులు మే 4న చత్రాసాల్ స్టేడియం పార్కింగ్ ఏరియాలో దాడి చేశారు. చికిత్స పొందుతూ సాగర్ చనిపోవడంతో సుశీ‌ల్ పై హత్యా నేరం మోపబడింది. హత్య జరిగిన నాటి నుంచి 18 రోజులు పోలీసుల కళ్లగప్పి తప్పించుకొని తిరిగిన సుశీల్ చివరకు మే 22న దొరికాడు.

  Published by:John Kora
  First published:

  Tags: Delhi police, Diet, Susheel kumar, Wrestling

  ఉత్తమ కథలు