SURPRISED VIRAT KOHLI EXPLAINS TO PLAYERS WHY HE IS NOT OUT AFTER LEICESTERSHIRE PLAYERS CELEBRATE HIS DISMISSAL SJN
Virat Kohli : ప్రాక్టీస్ మ్యాచ్ లో కోహ్లీ రౌడీ గిరి మామూలుగా లేదుగా.. పాపం ప్రత్యర్థి ప్లేయర్స్.. చూస్తుంటే జాలేస్తోంది.
PC : TWITTER
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli), జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), మొహమ్మద్ షమీ (Mohammed Shami) లాంటి స్టార్ ప్లేయర్లు తొలిసారి మైదానంలోకి దిగారు. జూలై 1 నుంచి ఇంగ్లండ్ (England)తో జరిగే రీషెడ్యూల్ టెస్టు మ్యాచ్ కోసం సన్నాహకంగా జరుగుతోన్న ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు బరిలోకి దిగారు.
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli), జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), మొహమ్మద్ షమీ (Mohammed Shami) లాంటి స్టార్ ప్లేయర్లు తొలిసారి మైదానంలోకి దిగారు. జూలై 1 నుంచి ఇంగ్లండ్ (England)తో జరిగే రీషెడ్యూల్ టెస్టు మ్యాచ్ కోసం సన్నాహకంగా జరుగుతోన్న ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు బరిలోకి దిగారు. నాలుగు రోజుల పాటు లీసెస్టర్ షైర్ కౌంటీ టీంతో టీమిండియా (Team India) వార్మమ్ మ్యాచ్ గురువారం ఆరంభమైంది. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడో అని భారత అభిమానుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యంగా కోహ్లీ గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. అడపాదడపా అర్ధ సెంచరీలు బాదుతున్నా.. కెరీర్ తొలినాళ్లలోని కోహ్లీని మాత్రం మళ్లీ చూపించడం లేదు.
లీసెస్టర్ సిటీతో జరుగుతున్న నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో భాగంగా తొలి రోజు ఆటలో అనూహ్య సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. భారత్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఇన్నింగ్స్ 37వ ఓవర్ ను వేయడానికి అబిదినే సకండే బౌలింగ్ కు వచ్చాడు. అతడు నాలుగో బంతిని ఆఫ్ స్టంప్ కు ఆవలగా వేయగా.. స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న కోహ్లీ షాట్ ఆడాడు. అయితే బంతి మొదటి స్లిప్ లో ఉన్న ఫీల్డర్ చేతిలోకి చేరింది. దాంతో లీసెస్టర్ ప్లేయర్స్ కోహ్లీ వికెట్ తీశామని సంబరాలకు దిగారు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం మైదానం వీడేందుకు ఒప్పుకోలేదు. తాను నాటౌట్ అంటూ అటు అంపైర్లతో ఇటు ప్రత్యర్థి ప్లేయర్లతో వాదించాడు. కోహ్లీ లాంటి ప్లేయర్ అలా అంటుండే సరికి లీసెస్టర్ ప్లేయర్లకు సైతం ఏం చేయాలో పాలుపోలేదు. అయితే రియల్ టైమ్ లో చూసినప్పుడు మాత్రం బాల్ బ్యాట్ కు ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ లోని ప్లేయర్ చేతిలోకి వెళ్లినట్లు తేలింది.
అయితే బాల్ బౌన్స్ వల్ల అలా డీవియేట్ అయ్యి వెళ్లిందే తప్ప తన బ్యాట్ కు తగల్లేదని కోహ్లీ ప్రత్యర్థి ప్లేయర్లకు చెప్పాడు. దాంతో అంపైర్లు చర్చించుకుని కోహ్లీని నాటౌట్ అంటూ ప్రకటించాడు. అనంతరం కోహ్లీ 33 పరుగులు చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు. రోహిత్ శర్మ (25), శుబ్ మన్ గిల్ (21), హనుమ విహారి (3), శ్రేయస్ అయ్యర్ (0), రవీంద్ర జడేజా (13), శార్దుల్ ఠాకూర్ (6) విఫలం అయ్యారు. అయితే తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ (70 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) పోరాడటంతో భారత్ 200 మార్కును అందుకుంది. ప్రస్తుతం షమీ (18 నాటౌట్) చివర్లో ఆకట్టుకున్నాడు. అయితే భారత్ తొలి రోజు ఓవర్ నైట్ స్కోరు 8 వికెట్లకు 246 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. లీసెస్టర్ బౌలర్ రోమన్ వాకర్ 5 వికెట్లతో చెలరేగాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.