HOME »NEWS »SPORTS »suresh raina spends time in gym with a powerful workout session and shares video in instagram goes viral srd

Suresh Raina : జిమ్ లో చెమటలు చిందిస్తోన్న చిన్న తలా సురేష్ రైనా..వీడియో వైరల్

Suresh Raina : జిమ్ లో చెమటలు చిందిస్తోన్న చిన్న తలా సురేష్ రైనా..వీడియో వైరల్
Suresh Raina (ఫైల్ ఫోటో)

Suresh Raina : టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా జిమ్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించిన అతడు దేశవాళీ టీ20 టోర్నీలో తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

  • Share this:
    టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా జిమ్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించిన అతడు దేశవాళీ టీ20 టోర్నీలో తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లేటెస్ట్ గా జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు చిన్న తలా. ఈ వీడియో ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు సురేష్ రైనా. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరలవుతోంది. భారత మాజీ సారథి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన రోజే రైనా కూడా తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే యూఏఈ వేదికగా జరిగిన లీగ్‌ 13వ సీజన్‌కు వ్యక్తిగత కారణాలతో అతడు దూరంకావడంతో.. రైనా ఐపీఎల్‌లో కొనసాగుతాడా? లేదా?అని అందరిలో ప్రశ్నలు తలెత్తాయి. అయితే, ఈ ఏడాది ఐపీఎల్‌ టి20 క్రికెట్‌ టోర్నీలో చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టు సురేశ్‌ రైనాను అట్టిపెట్టుకుంది. యూఏఈలో జరిగిన గత సీజన్‌లో ఆడటం కోసం రైనా అక్కడిదాకా వెళ్లి... అనూహ్యంగా తిరుగుపయనమయ్యాడు. ఇది చెన్నై బ్యాటింగ్‌ ఆర్డర్‌పై పెను ప్రభావం చూపింది. జట్టు కూర్పు ఏమాత్రం కుదరలేదు. దీంతో సీఎస్‌కే లీగ్‌ చరిత్రలోనే అత్యంత నిరాశజనకమైన ప్రదర్శనతో నిష్క్రమించింది. దీంతో సురేశ్‌ రైనాకు చెన్నై ఫ్రాంచైజీ మంగళం పాడటం ఖాయమనే వార్తలొచ్చాయి. అప్పట్లో ఫ్రాంచైజీ యజమాని, బీసీసీఐ మాజీ చీఫ్‌ శ్రీనివాసన్‌ కూడా సూచనప్రాయంగా ఇదే చెప్పారు. కానీ ఇప్పుడు సూపర్‌కింగ్స్‌ రైనాను అట్టిపెట్టుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

    సురేష్ రైనా ఇప్పటి వరకు 226 వన్డేలు, 19 టెస్ట్‌లు, 78 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వన్డేలో 5 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలతో 5,615 పరుగులు చేశాడు రైనా. టెస్టుల్లో ఒక సెంచరీ, 8 అర్ధ సెంచరీలతో 768 పరుగులు పూర్తి చేశాడు.ఇక టీ20ల్లో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలతో 1,605 పరుగులు చేశాడు. రైనా టీమిండియా జట్టులో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్ కూడా వేసి అన్ని విభాగాల్లోనూ రాణించాడు.2018, జులై 8న ఇంగ్లండ్ జట్టుతో ఆడిన టీట్వంటీయే సురేష్ రైనాకు చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ తర్వాత ఏ మ్యాచ్‌లోనూ అతడు ఆడలేదు. సురేష్ రైనా 2005, జులై 30న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా టీమిండియా జట్టులో అరంగ్రేటం చేశాడు. 2006 ట్వీ20 జట్టులో, 2010లో టెస్ట్ జట్టులో ఎంట్రీ ఇచ్చాడు.


    View this post on Instagram

    A post shared by Suresh Raina (@sureshraina3)



    ఐపీఎల్‌లోనూ ఎన్నో రికార్డులు సాధించాడు రైనా. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో రైనా రెండో స్థానంలో ఉన్నాడు. 5412 పరుగులతో కొహ్లీ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. 5368 పరుగులతో సెకండ్ ప్లేస్ సాధించాడు రైనా. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినప్పటికీ ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతాడు.
    Published by:Sridhar Reddy
    First published:January 21, 2021, 18:41 IST