అందుకే ధోనీతో కలిసి రిటైర్మెంట్ ప్రకటించా: సురేశ్ రైనా

టీమిండియా మాజీ సారధి ధోనీ,బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోల్ పలికిన విసయం తెలిసిందే. ఈ గురుశిష్యులు తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం క్రీడాలోకాన్ని నివ్వేరపోయేలా చేసింది.


Updated: August 17, 2020, 5:34 PM IST
అందుకే ధోనీతో కలిసి రిటైర్మెంట్ ప్రకటించా: సురేశ్ రైనా
టీమిండియా మాజీ సారధి ధోనీ,బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోల్ పలికిన విసయం తెలిసిందే. ఈ గురుశిష్యులు తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం క్రీడాలోకాన్ని నివ్వేరపోయేలా చేసింది.
  • Share this:




టీమిండియా మాజీ సారధి ధోనీ,బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోల్ పలికిన విసయం తెలిసిందే. ఈ గురుశిష్యులు తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం క్రీడాలోకాన్ని నివ్వేరపోయేలా చేసింది. క్రికెట్‌కు వీరు చేసిన సేవలను పలువురు క్రీడా దిగ్గజాలు సోషల్ మీడియా వేదికగా కొనయాడారు. తాజాగా తన రిటైర్‌మెంట్ స్పందించారు సురేష్ రైనా. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తను ఆటకు గుడ్‌బై చెప్పడం వెనుక కారణాన్ని వివరించారు.

"ఇద్దరం కలిసి ఒక్కసారి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాం. ఆటకు గుడ్‌బై కూడా ఒక్కేసారి చేప్పాలని నిర్ణయించుకున్నాం. అందుకే ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను అన్నారు" రైనా. అయితే ఐపీఎల్‌లో మాత్రం తన ప్రయాణం కొనసాగుతోందని తెలిపారు. 2004 డిసెంబర్ 23న చిట్టగాంగ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో ధోనీ మెుదటిసారి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు.

"నేను 2005 జూలై 30న శ్రీలంకపై తొలి మ్యాచ్ ఆడాను. ఇద్దరికి 6-7 నెలల వ్యత్యాసం ఉంది. అలాగే ఐపీఎల్‌లో సీఎస్‌కే జట్టు తరుపున మెుదటి నుంచి ఆడుతున్నాం. అక్కడ మా బంధం మరింతగా బలపడింది. అలా అంతర్జాతీయ క్రికెట్‌కు ఇద్దరం కలిసి ఒక్కేసారి అల్విదా ప్రకటించామని" తాజాగా దైనిక్ జాగ్రన్ పత్రికకు ఇచ్చిన ఇంటార్వూలో తెలిపాడు.
Published by: Rekulapally Saichand
First published: August 17, 2020, 5:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading