Dhoni-Raina : ధోనీ రిటైర్మెంట్ గురించి లీక్ చేసిన రైనా.. అదే నిజమైతే ఇక ధోనీ క్రికెట్‌కు వీడ్కోలే

ధోనీ రిటైర్మెంట్ ఖాయమేనా? రైనా మాటల్లో అసలు విషయం అదేనా?

ధోనీ రిటైర్మెంట్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. కానీ ఏది నమ్మాలో ఏది నమ్మవద్దో అర్దం కావడం లేదు. తాజాగా ధోనీ ఆప్తుడు, సహచర క్రికెటర్ సురేష్ రైనా చేసిన వ్యాఖ్యలతో ధోనీ రిటైర్మెంట్‌పై క్లారిటీ వచ్చేసింది.

 • Share this:
  భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఆట నుంచి పూర్తిగా రిటైర్మెంట్ (Retirement) తీసుకుంటాడనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ముఖ్యంగా గత ఏడాది అంతర్జాతాయ క్రికెట్‌ నుంచి వైదొలగిన తర్వాత ఐపీఎల్ (IPL) నుంచి కూడా నిష్క్రమిస్తాడని అందరూ భావించారు. 'ఎల్లో జెర్సీ'ని వదిలేస్తారా అని ఒకరు ప్రశ్నించగా.. కచ్చితంగా లేదు అని ధోనీ వ్యాఖ్యానించాడు. కానీ ఇప్పటికీ ధోనీ రిటైర్మెంట్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఐపీఎల్ 2021 ధోనీ చివరి సీజన్ అని పలు మాధ్యమాల్లో చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాత్రం ఎంఎస్ ధోనీ మరో రెండేళ్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తాడని పేర్కొన్నారు. కానీ ఈ విషయంపై ధోనీ మాత్రం ఇంత వరకు స్పందించలేదు. కాగా, ధోనీ రిటైర్మెంట్‌పై అతడి సహచరుడు, స్నేహితుడు సురేష్ రైనా (Suresh Raina) కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనీ కనుక ఈ సీజన్‌లో చెన్నైని గెలిపిస్తే మరో రెండేళ్లు ఐపీఎల్ ఆడటానికి ఒప్పించేందుకు ప్రయత్నిస్తాను అని అన్నాడు. రైనా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ధోనీ రిటైర్మెంట్‌పై పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

  సాధారణంగా ధోనీ తన మనసులో ఉన్న మాట ఎవరితోనూ పంచుకోడు. ఏ కీలక నిర్ణయమైనా స్వయంగా తీసుకొని వెంటనే ప్రకటిస్తుంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడం కూడా అకస్మాత్తుగా జరిగిన పరిణామమే. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది సేపటికే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మొదటి నుంచి ధోనీ, రైనాది టీమ్ ఇండియాలో ప్రత్యేకమైన అనుబంధం. శరీరాలు వేరైనా ఆత్మ ఒకటే అనే రీతిలో ఇద్దరూ ఉంటుంటారు. ఇద్దరి మధ్య వయసు రిత్యా అంతరం ఉన్నా.. ఇద్దరూ ఒకరికొకరు అన్నట్లు ఉంటారు. టీమ్ ఇండియాలో రైనా ఎక్కువ కాలం కొనసాగడానికి రైనానే కారణమని చాలా మందికి కూడా తెలుసు. అలాంటి రైనా 'ఈ ఏడాది టైటిల్ గెలిస్తే ఒప్పిస్తాను' అని అన్నాడంటే.. ధోనీ ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడనే అర్థం ధ్వనిస్తున్నది. ఒక వేళ సీఎస్కే విజేతగా నిలవక పోతే ధోనీ రిటైర్మెంట్ ఖాయంగానే కనిపిస్తున్నది. ఇటీవల కాలంలో ధోనీ క్రికెటేతర విషయాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు. రాబోయే మెగా వేలంలో అన్ని టీమ్‌ల జాతకాలు మారిపోనున్నాయి. ధోనీ, రైనాలను రిటైన్ చేసుకుంటే సీఎస్కేకు చాలా భారం పడుతుంది. ప్రస్తుతం వీరిద్దరి ఫామ్‌ కూడా అంతర్జాతీయ స్థాయికి సరపోవడం లేదు. తానే జట్టుకు భారం కాకూడదని కూడా ధోనీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.

  What a Catch : మైదానంలో హార్లిన్ డియోల్ అద్భుతమైన క్యాచ్.. మహిళా క్రికెటర్లో ఇలాంటి క్యాచ్ చూసి ఉండరు
   ధోనీ కనుక ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిస్తే.. అతడిని జట్టులో కొనసాగించడానికి పెద్దగా విమర్శలు రాకపోవచ్చు. కానీ ఓడిపోతే అతడిపై తప్పక ఒత్తిడి ఉంటుంది. అందుకే ధోనీ మనసులోని మాటలే రైనా నోటి నుంచి వచ్చాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 'వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ధోనీ భాయ్ ఆడకపోతే నేనూ ఆడను. ఈ సారి టైటిల్ గెలిస్తే మరో రెండేళ్లు ఐపీఎల్ ఆడటానికి ధోనీని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను' అని రైనా అన్నాడు.
  Published by:John Naveen Kora
  First published: