• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • SURESH RAINA IS BACK WATCH HOW RAINA RUN OUT UNFORTUNATELY JNK

IPL 2021 : చిన్న తలా రైనా ఈజ్ బ్యాక్.. ఆ రనౌట్ ఎలా జరిగిందో తెలుసా?

IPL 2021 : చిన్న తలా రైనా ఈజ్ బ్యాక్.. ఆ రనౌట్ ఎలా జరిగిందో తెలుసా?

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మాన్ సురేష్ రైనా రనౌ కావడం అనుకోకుండా జరిగింది. [PC : iplt20.com]

  • Share this:
    ఐపీఎల్‌లో (IPL 2021) అనేక రికార్డులు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా (Suresh Raina) పేరు మీదే ఉన్నాయి. కరోనా కారణంగా ఐపీఎల్ 2020ని బీసీసీఐ (BCCI) యూఏఈలో నిర్వహించింది. గత సీజన్ చెన్నై ట్రైనింగ్ క్యాంపులో ఉండి.. యూఏఈ కూడా వెళ్లిన రైనా చివరి క్షణంలో వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. అప్పటికి కొన్ని రోజుల క్రితమే ధోనీతో కలసి రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. అయితే ఈ సీజన్‌లో రైనా ఆడతాడా లేడా అనే అనుమానాలు చాలా కాలం నెలకొన్నాయి. చెన్నై జట్టు (Chennai Super Kings) యాజమాన్యం రైనాను తిరిగి రిటైన్ చేసుకోవడంతో రైనా ఆడటం ఖాయమే అయ్యింది. ఐపీఎల్ 14వ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే రైనా తన సహజశైలిలో రెచ్చిపోయాడు. చెన్నై అభిమానులు చిన్న తలా (చిన్న అన్నయ్య) పిలుచుకునే రైనా కేవలం 36 బంతుల్లో 54 పరుగులు చేవాడు. ఇందులో 3 ఫోర్లతో పాటు 4 సిక్సులు ఉన్నాయి. రైనా ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

    రెండేళ్ల గ్యాప్ తర్వాత ఐపీఎల్ ఆడుతున్న సురేష్ రైనా తొలి మ్యాచ్‌లోనే తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించాడు. మొయిన్ అలీ, అంబటి రాయుడితో కలసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. రైనా క్రీజ్‌లో ఉండబట్టే 7వ ఓవర్ నుంచి 15వ ఓవర్ మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 100కు పైగా పరుగులు రాబట్టింది. అయితే రైనా అవుట్ అవడం చెన్నై అభిమానులను నిరాశ పరిచింది. అవేష్ ఖాన్ వేసిన 16వ ఓవర్ తొలి బంతికి రవీంద్ర జడేజా ఆన్ సైడ్ ఆడి పరుగు తీశాడు. ముందే రెండు పరుగులకు కాల్ ఇచ్చిన రవీంద్ర జడేజా.. తొలి పరుగు పూర్తి చేసి రెండో పరుగుకు వెళ్తుంటే బౌలర్ అవేష్ ఖాన్ అడ్డు రావడంతో ఆడిపోయాడు. ఇది చూసుకోని సురేష్ రైనా సగం పిచ్ దాటి వచ్చేశాడు. బంతి స్ట్రైకర్ ఎండ్ వైపు వేయడంతో పంత్ ఎలాంటి తప్పు చేయకుండా వికెట్లను గిరాటేయడంతో సురేష్ రైనా మైదానాన్ని వీడక తప్పలేదు. మంచి టచ్‌లో ఉన్న సురేష్ రైనా ఇలా అనూహ్యంగా అవుటవడంతో అభిమానులు నిరాశపడ్డారు. రవీంద్ర జడేజా కూడా ఏమీ చేయలేని స్థితిలో నిస్సహాయంగా ఉండిపోయాడు.





    ఇక ఐపీఎల్ చరిత్రలో సురేష్ రైనాకు చాలా రికార్డులు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా ఎక్కువ మ్యాచ్‌లు ఆడింది సురేష్ రైనానే. ఐపీఎల్‌లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న మొదటి బ్యాట్స్‌మాన్, 100కు పైగా సిక్సులు కొట్టిన బ్యాట్స్‌మాన్‌గా రైనా పేరిట రికార్డులు ఉన్నాయి.
    Published by:John Naveen Kora
    First published:

    అగ్ర కథనాలు