Home /News /sports /

సన్‌రైజర్స్ షాకింగ్ నిర్ణయం.. కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్.. వార్నర్‌ను తొలిగించిన ఎస్‌ఆర్‌హెచ్!

సన్‌రైజర్స్ షాకింగ్ నిర్ణయం.. కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్.. వార్నర్‌ను తొలిగించిన ఎస్‌ఆర్‌హెచ్!

విలియమ్సన్ (Image:IPL)

విలియమ్సన్ (Image:IPL)

సన్‌రైజర్స్ షాకింగ్ నిర్ణయం.. కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్.. వార్నర్‌ను తొలిగించిన ఎస్‌ఆర్‌హెచ్!



    సన్‌రైజర్స్ హైదరాబాద్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది, డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ స్థానం నుండి తప్పించి ఆ బాధ్యతలను న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అప్పగించింది . ప్రస్తుత ఐపీఎల్‌లో జట్టుకు నడిపించడంలో విఫలమయ్యాడు. ఆరు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్ధానాకి పడిపోయింది.  కేన్ విలియమ్సన్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌ నుండి  జట్టుకు నాయకత్వం వహిస్తాడు.

    ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాత ద్వారా తెలియజేసింది యాజమాన్యం. కెప్టెన్ మార్పుతో పాటు ఆ మ్యాచ్‌లో ఓవర్‌సీస్ కాంబినేషన్ కూడా మారుతుందని టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయం తెలియజేసింది. ఈ నిర్ణయాన్ని అంత తేలికగా తీసుకోలేదని వివరించింది. కష్టతరం అయినప్పటికి జట్టు ప్రయోజనల నేపథ్యంలో తప్పనిసరి తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. కొన్నేళ్లుగా డేవిడ్ వార్నర్ జట్టుకు చేసిన మేలును టీమ్‌మేనేజ్‌మెంట్ మరవదని వెల్లడించింది. అతనిపై ఎప్పటికి అపారమైన గౌరవం ఉందని స్పష్టం చేసింది. తదుపరి మ్యాచ్‌ల్లో ఆఫ్ ఫీల్డ్, ఆన్ ఫీల్డ్‌లో వార్నర్ పాత్ర కీలకంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.





    2016 లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ట్రోఫీని సాధించిన డేవిడ్ వార్నర్, అద్భుతమైన తన బ్యాటింగ్ ఫామ్‌తో జట్టుకు టైటిల్ గెలిచేలా చేశాడు . ఇక ఐపిఎల్ 2021 లో ఇప్పటివరకు రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై జట్టు ఓటిమితో అతనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఆ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 171 పరుగులతో చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 57 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: IPL 2021, Sunrisers Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు