కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్న వెంటనే.. ఆ పదవిని రోహిత్ శర్మ (Rohit Sharma)కు అప్పగించారు. రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న వెంటనే.. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ తో తలపడేందుకు సిద్ధమౌతోంది. టి20 ప్రపంచకప్ (T-20 World Cup 2021 )లో భారత జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించడం... ఈనెల 17 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో (India Vs New Zealand) మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఉండటంతో మంగళవారం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. టి20 ప్రపంచకప్ బరిలో దిగిన 15 మంది జట్టులో ఏడుగురు మాత్రమే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యారు.శ్రేయస్ అయ్యర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌లకు మళ్లీ పిలుపు వచ్చింది. ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న వెంకటేశ్ అయ్యర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్), హర్షల్ పటేల్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), అవేశ్ ఖాన్ (ఢిల్లీ క్యాపిటల్స్)లకు తొలిసారి జాతీయ జట్టులో స్థానం దక్కింది.
ఐపీఎల్-2021లో మెరుపులు మెరిపించిన పృథ్వీ షా(డీసీ), దేవ్‌దత్ పడిక్కల్(ఆర్సీబీ), ఉమ్రాన్ మాలిక్(ఎస్ఆర్హెచ్)లకు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కకపోవడంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. అయితే, వారందరికీ గుడ్ న్యూస్.దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న భారత్-ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సువర్ణావకాశం లభించింది. ఈ నెల 23 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న 3 మ్యాచ్‌ల (నాలుగు రోజుల మ్యాచ్‌లు) సిరీస్ కోసం 14 మంది సభ్యుల భారత-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఈ జట్టుకు సారధిగా ప్రియాంక్ పంచల్‌ను ఎంపిక చేసిన భారత క్రికెట్ బోర్డు.. సీనియర్లు రాహుల్ చాహర్, నవ్‌దీప్ సైనీలకు చోటు కల్పించింది. ఐపీఎల్ స్టార్లతో పాటు జట్టు సభ్యులంతా ఈ సిరీస్‌లో రాణించి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్నారు. భారత్-ఏ, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి మ్యాచ్ నవంబర్ 23-26 వరకు, రెండో మ్యాచ్ నవంబర్ 29-డిసెంబర్ 2 వరకు, మూడో మ్యాచ్ డిసెంబర్ 6-9 వరకు జరగనున్నాయి.
ఇదిలా ఉంటే, యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్-2021 సెకెండ్ లెగ్‌లో పృథ్వీ షా, దేవ్‌దత్ పడిక్కల్, ఉమ్రాన్ మాలిక్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగిన సంగతి తెలిసిందే. పృథ్వీ షా దాదాపు ప్రతి మ్యాచ్‌లో రాణించగా, పడిక్కల్ సూపర్ శతకంతో, ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ బంతులతో అదరగొట్టారు. ఐపీఎల్లో తన మొదటి బంతిని 145 కి.మీ.ల వేగంతో వేసిన ఉమ్రాన్ మాలిక్, ఆ తర్వాత 142, 150, 147, 143, 142 కి.మీ.ల వేగంతో బంతులు వేశాడు.
ఇది కూడా చదవండి : ఐసీసీ, బీసీసీఐ అత్యాశే టీమిండియా కొంపముంచిందా..! కోహ్లీసేనను బలిపశువు చేశారా..?
భారత-ఏ జట్టు: ప్రియాంక్ పంచల్(కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, దేవ్‌దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, బాబా అపరాజిత్, ఉపేంద్ర యాదవ్(వికెట్‌కీపర్), కృష్ణప్ప గౌతమ్, రాహుల్ చాహర్, సౌరభ్ కుమార్, నవ్‌దీప్ సైనీ, ఉమ్రాన్ మాలిక్, ఇషాన్ పోరెల్, అర్జాన్ నగవస్వల్లా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL, Prithvi shaw, Sunrisers Hyderabad, Team India