Home /News /sports /

SUNRISERS HYDERABAD FULL MAKE OVER FRANCHISE REPLACING COACHING STAFF WITH NEW CANDIDATES JNK

IPL: సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా ప్రక్షాళన.. కోచింగ్ స్టాఫ్‌తో మొదలు పెట్టిన యాజమాన్యం.. ఏయే మార్పులు చేస్తోందంటే..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయనున్న యాజమాన్యం (PC: SRH)

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయనున్న యాజమాన్యం (PC: SRH)

Sunrisers hyderabad: ఐపీఎల్ 2021లో పేలవ ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వచ్చే సీజన్ కోసం సన్నద్దం అవుతున్నది. ముందుగా కోచింగ్ స్టాఫ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త వారిని నియమించుకుంటున్నది. ఈ సారి ఎలాగైన మెరుగైన ప్రదర్శన చేయడానికి వ్యూహాలు రచిస్తున్నది.

ఇంకా చదవండి ...
  సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunriser Hyderabad) జట్టుకు ఈ ఏడాది ఏమీ కలసి రాలేదు. రెండు విడతలుగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)(IPL) లో అత్యంత చెత్త ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇక కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner), యాజమాన్యానికి మధ్య వివాదాలు మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. జట్టు పేలవ ప్రదర్శనకు వార్నర్‌ను బాధ్యుడిని చేయడంతో అతడు అలకతో జట్టు నుంచి వెళ్లిపోయాడు. సన్‌రైజర్స్ గెలిచిన ఏకైన ఐపీఎల్ టైటిల్‌ను తీసుకొని వచ్చిన వార్నర్‌ను కనీసం తిరిగి రిటైన్ చేసుకోవాలని కూడా భావించలేదు. అదే వార్నర్ ఐపీఎల్ తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) ఆస్ట్రేలియా (Australia) గెలుపులో కీలక పాత్ర పోషించి ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా (Player of the Tournament) నిలిచాడు. ఇక సన్‌రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించే రషీద్ ఖాన్ కూడా జట్టును వీడాడు. గత ఐదు సీజన్లుగా సన్‌రైజర్స్‌కు నమ్మకమైన బౌలర్‌గా ఉన్న ఈ ఆఫ్గానిస్తాన్ బౌలర్ జీతం విషయంలో ఏర్పడ్డ విభేదాల వల్ల జట్టును వీడాడు. ఎస్ఆర్‌హెచ్ కేవలం కేన్ విలియమ్‌సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను మాత్రమే రిటైన్ చేసుకున్నది. ఇక ఐపీఎల్ 2022లో పూర్తిగా జట్టును ప్రక్షాళన చేయాలని యాజమాన్యం భావిస్తున్నది.

  సన్‌రైజర్స్ యాజమాన్యం కోచింగ్ స్టాఫ్‌తో ప్రక్షాళన మొదలు పెట్టింది. ఎస్‌ఆర్‌హెచ్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో ఇకపై సన్‌రైజర్స్‌కు అందుబాటులో ఉండడు. గతంలో జట్టులో ఎంపికలు, వేలం పాట బాధ్యతలు అన్నీ లక్ష్మణ్ చూసుకునేవాడు. ఇప్పుడు అతడి స్థానాన్ని టామ్ మూడీ చేపట్టబోతున్నట్లు తెలుస్తున్నది. 2016లో ఎస్‌ఆర్‌హెచ్ టైటిల్ గెలిచినప్పుడు మూడీ హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఆ తర్వాత జట్టును వీడిన మూడీ.. గత సీజన్‌లో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఈ సీజన్ నుంచి అతడిని మళ్లీ హెడ్ కోచ్‌గా నియమించాలని యాజమాన్యం భావిస్తున్నది.

  Virat Kohli: కోహ్లీ వ్యవహారంలో బీసీసీఐ ఏం చేయబోతున్నది? మాజీ క్రికెటర్లు ఏమంటున్నారు?
  ప్రస్తుతం ఉన్న కోచ్ ట్రెవర్ బేలిస్ ఆ పదవిని వదిలేశాడు. ఆ ఖాళీని మూడీతో భర్తీ చేయనున్నది. ఇక బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్‌ను నియమించనున్నది. ఇప్పటికే అతడితో చర్చలు ముగిశాయి. మరో వారం రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన చేయనున్నది. డేల్ స్టెయిన్ 2013 నుంచి 2015 వరకు సన్‌రైజర్స్ తరపున ఆడాడు. ఆ తర్వాత ఆర్సీబీ ఫ్రాంచైజీలోకి వెళ్లాడు. ఐపీఎల్‌లో 95 మ్యాచ్‌లు ఆడి 97 వికెట్లు తీశాడు. ఇక అతడి టెస్టు రికార్డు చూస్తే 93 మ్యాచ్‌లలో 439 వికెట్లు తీశాడు. వన్డేల్లో 196 వికెట్లు, టీ20ల్లో 47 వికెట్లు తీసిన రికార్డు ఉన్నది. గత ఏడాది పీఎస్ఎల్ ఆడటానికి ఐపీఎల్‌ను వీడాడు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా భారత జట్టు మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీతో యాజమాన్యం చర్చలు జరుపుతున్నది. ఒక వారంలోపు కోచింగ్ స్టాఫ్‌కు సంబంధించిన ప్రకటనను ఎస్ఆర్‌హెచ్ చేయనున్నట్లు తెలుస్తున్నది.

  Suresh Raina: ‘సార్సోం కా సాగ్‌’ సురేష్ రైనా వింటర్ డిష్.. దీని స్పెషల్ ఏంటో తెలుసా..?
  సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం ముగ్గురు ప్లేయర్లనే రిటైన్ చేసుకున్నది. అయితే ఈ సారి వేలం పాటలో విడుదల చేసిన ఆటగాళ్లలో ఇద్దరిని తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. రషీద్ ఖాన్‌తో పాటు నటరాజన్‌ను వేలంలో తిరిగి కొనుగోలు చేయడానికి సన్‌రైజర్స్ ప్రయత్నిస్తుందని సమాచారం. రషీద్ ఖాన్ కనుక ఫ్రీ పికప్‌లో కొత్త జట్లలోకి వెళ్లకపోతే అతడి కోసం కొంచెం భారీ ధర అయినా వెచ్చించాలని ఫ్రాంచైజీ భావిస్తున్నది. ఈ సారి లీగ్ మొత్తం ఇండియాలోనే జరుగనున్నది. ఇక్కడి పిచ్‌లపై రషీద్ చక్కగా రాణిస్తాడు. అందుకే అతడిని మళ్లీ తీసుకునే ఆలోచన చేస్తున్నది.

  Virat Kohli లాగే నాకు తీవ్ర అన్యాయం జరిగింది.. బాంబు పేల్చిన టీమిండియా బౌలర్..


  అలాగే నటరాజన్ గురించి ఇటీవల కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ మాట్లాడాడు. అతడొక అద్భుతమైన బౌలర్ అని కితాబిచ్చాడు. ఈ క్రమంలో అతడిని తీసుకోవడానికి యాజమాన్యాన్ని కేన్ ఒప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. జనవరిలో జరిగే మెగా వేలంపాటలో చాలా మంది నాణ్యమైన ఆటగాళ్లు అందుబాటులోకి రానున్నారు. ఈ సారి స్వదేశీ ఆటగాళ్లను తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా భావిస్తున్నది. తుది జట్టు కూర్పులో కష్టం కాకుండా విదేశీ క్రీడాకారులను తగ్గించుకొని బెంచ్‌పై స్వదేశీ ఆటగాళ్లు ఉండేలా చూసుకోనున్నారు. మొత్తానికి వచ్చే సీజన్‌లో సన్‌రైజర్స్‌ను అభిమానులు సరికొత్తగా చూడనున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:John Kora
  First published:

  Tags: IPL 2022, Kane Williamson, Sunrisers Hyderabad

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు