Home /News /sports /

IPL 2022: ఇదేం ఫైనల్‌రా బాబూ.. సన్‌రైజర్స్‌ను కన్ఫ్యూజన్‌లో పడేసిన టీ20 వరల్డ్ కప్.. ఎవరిని రిటైన్ చేయాలి?

IPL 2022: ఇదేం ఫైనల్‌రా బాబూ.. సన్‌రైజర్స్‌ను కన్ఫ్యూజన్‌లో పడేసిన టీ20 వరల్డ్ కప్.. ఎవరిని రిటైన్ చేయాలి?

కన్ప్యూజన్‌లో పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ (PC: SRH)

కన్ప్యూజన్‌లో పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ (PC: SRH)

IPL 2022: వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ 2022కి ముందు బీసీసీఐ మెగా వేలాన్ని నిర్వహించనున్నది. ఇప్పటికే రిటైన్ పాలసీని ప్రకటించడంతో ఆయా ఫ్రాంచైజీలు ఎవరెవరిని అట్టిపెట్టుకోవాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే వరల్డ్ కప్ ఫైనల్ ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని కన్ఫ్యూజన్‌లో పడేసింది.

ఇంకా చదవండి ...
    ఐపీఎల్ 2022కి (IPL 2022) ముందు బీసీసీఐ (BCCI) మెగా వేలం (Mega Auction) నిర్వహించబోతున్నది. ఈ సారి కొత్తగా రెండు జట్లు రావడంతో మెగా వేలంలో ఆటగాళ్లకు చాలా డిమాండ్ ఉండబోతున్నది. ఇప్పటికే ఉన్న పాత 8 జట్ల కోసం బీసీసీఐ రిటైన్ పాలసీని (Retain Policy) ప్రకటించింది. దీని ప్రకారం ఏదైనా జట్టు ఇద్దరు విదేశీ ఇద్దరు స్వదేశీ.. లేదా ముగ్గురు స్వదేశీ ఒక విదేశీ క్రికెటర్లను అట్టిపెట్టుకోవచ్చు. ఈ ఏడాది ఐపీఎల్ ప్రదర్శన చూసిన అనంతరం ఆయా జట్లు ఎవరెవరిని విడుదల చేయాలనే దానిపై ఒక స్పష్టతకు వచ్చాయి. ఐపీఎల్ 2021లో పేలవ ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderbad) కూడా రిటైన్ చేసుకోవాల్సిన ప్లేయర్ల గురించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. కేన్ విలియమ్‌సన్, రషీద్ ఖాన్, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్‌లను జట్టుతో పాటు ఉంచుకోవాలని భావించింది. ఫామ్‌లో లేని డేవిడ్ వార్నర్‌ను వదిలించుకోవడానికి సిద్దపడింది.

    అయితే టీ20 వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు చూసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం పూర్తి గందరగోళంలో పడిపోయింది. ఫామ్‌లో లేడనుకున్న డేవిడ్ వార్నర్ అద్భుత ప్రదర్శన చేయడమే కాకుండా ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు. ఇక గాయం కారణంగా ఈ సీజన్ ఆడలేకపోయిన మిచెల్ మార్ష్ ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరోవైపు కేన్ విలియమ్‌సన్ జూలు విదిల్చాడు. విదేశీ కోటాలో అట్టిపెట్టుకుందామనుకున్న రషీద్ ఖాన్, స్వదేశీ ప్లేయర్ భువనేశ్వర్ అసలు స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదు. వీరిద్దరపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు.

    T20 World Champions: ఆస్ట్రేలియన్ల విజయం వెనుక భారత బౌలర్.. అసలు ఆ స్టోరీ ఏంటో తెలుసా?







    ఇక ఇప్పుడు ఏయే ఆటగాళ్లను జట్టుతో పాటు ఉంచుకోవాలో అర్దం కాక సన్‌రైజర్స్ యాజమానయం తలపట్టుకున్నది. మరోవైపు తన భర్తపై గతంలో వచ్చిన విమర్శలను డేవిడ్ భార్య కాండీస్ ట్విట్టర్‌లో సెటైర్ ద్వారా తిప్పికొట్టింది. ఐపీఎల్ 2021 సమయంలో వార్నర్ ఫామ్ చూసి చాలా మంది ఇక అతడి పని అయిపోయిందని.. ఏజ్ పెరిగిపోతుందని.. ఫామ్ కోల్పోయాడని పలు విమర్శలు చేశారు. వీటన్నింటినీ గుర్తు పెట్టుకున్న కాండీస్.. ఔటాఫ్ ఫామ్.. టూ ఓల్డ్ అండ్ స్లో.. కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశారు. దీనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఫొటోను కూడా జత చేసింది. వార్నర్‌ను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకునే అవకాశాలు లేనట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. అతడు ఫామ్‌లోకి వచ్చినా.. యాజమాన్యంతో చాలా గ్యాప్ వచ్చందని.. అది భర్తీ చేయలేరని అంటున్నారు. ఆర్సీబీ లేదా ఏదైనా కొత్త ఫ్రాంచైజీ వార్నర్‌ను తీసుకునే అవకాశం ఉన్నది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: David Warner, IPL, Sunrisers Hyderabad, T20 World Cup 2021

    తదుపరి వార్తలు