• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • SUNRISERS HYDERABAD CEO KAVIYA MARAN FULL HAPPY AFTER IPL 2021 SUSPENDED AND MEMES ON HER GOES VIRAL SRD

IPL 2021 : దేవుడా ఉన్నాడ్రా... మా కావ్య పాపనే ఏడిపిస్తారా..ఇప్పుడు తిక్క కుదిరిందిగా..

IPL 2021 : దేవుడా ఉన్నాడ్రా... మా కావ్య పాపనే ఏడిపిస్తారా..ఇప్పుడు తిక్క కుదిరిందిగా..

IPL 2021 : దేవుడా ఉన్నాడ్రా... మా కావ్య పాపనే ఏడిపిస్తారా..ఇప్పుడు తిక్క కుదిరిందిగా..

IPL 2021 : ఈ సాలా కప్ నమ్‌దే అనే టాప్ గేర్‌లో దూసుకెళ్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు- ఈ పరిణామంతో దిగ్భ్రాంతికి గురవుతోంది. తమ దూకుడుకు సడన్ బ్రేక్ పడినట్టు ఈ జట్టు ఫ్రాంఛైజీ భావిస్తోంది. మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్‌‌ను ఫుల్ ఖుష్ అయినట్టే.

  • Share this:
    అంతా ఊహించిందే జరిగింది. కరోనా ఖాతాలో ఐపీఎల్ అనే వికెట్ కూడా పడింది. మహమ్మారి దెబ్బకి ఐపీఎల్ 14 వ సీజన్ మొత్తానికి వాయిదా పడింది. మళ్లీ ఈ క్యాష్ రీచ్ లీగ్ ఎప్పుడూ జరుగుతుందో ఐడియా లేదు. ఈ ఏడాది సెప్టెంబర్ లో మళ్లీ నిర్వహిస్తారన్న ఊహగానాలు వస్తున్నప్పటికీ..దీనిపై ఇంకా బీసీసీఐ క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు.. మెగా కప్ .. టీ -20 వరల్డ్ కప్ టోర్నీ యే జరుగుతుందో లేదో అన్న అనుమానాలు మొదలయ్యాయ్. మరోవైపు.. ఐపీఎల్ 2021 టోర్నమెంట్ అర్ధాంతరంగా వాయిదా పడటం కొన్ని ఫ్రాంఛైజీలను తీవ్ర నిరాశకు గురి చేయగా.. మరికొన్నింట్లో పుల్ జోష్‌ను నింపాయి. ఆ ఫ్రాంఛైజీలేమిటో అర్థం చేసుకోవడానికి బుర్రకు పెద్దగా పదును పెట్టాల్సిన పనీ లేదు. పాయింట్ల టేబుల్ చూసుకుంటే తెలిసిపోతుంది. టైటిల్ హాట్ ఫేవరెట్లుగా టోర్నమెంట్‌ను ఆరంభించిన జట్లన్నీ ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ఐపీఎల్ వాయిదా పడటం జీర్ణించుకోలేని అంశమే. ఈ నాలుగు జట్లూ ఇప్పటికే ప్లేఆఫ్ ముగింట్లో నిలిచాయి.

    ఈ సీజన్ ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా.. ఆ పాయింట్ల టేబుల్ మారదు. ఎక్కడ అంతమైందో.. అక్కడి నుంచే ఆరంభమౌతుంది. అయినప్పటికీ- ఇప్పటి దూకుడును కొనసాగించడం కష్టతరమే. ఈ సాలా కప్ నమ్‌దే అనే టాప్ గేర్‌లో దూసుకెళ్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు- ఈ పరిణామంతో దిగ్భ్రాంతికి గురవుతోంది. తమ దూకుడుకు సడన్ బ్రేక్ పడినట్టు ఈ జట్టు ఫ్రాంఛైజీ భావిస్తోంది. మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్‌‌ను ఫుల్ ఖుష్ అయినట్టే. ఐపీఎల్ 2021ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం హైదరాబాద్ ఫ్యాన్స్‌ను అంతులేని ఆనందానికి గురి చేస్తోంది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫాన్స్ కూడా దాదాపు ఇదే పరిస్థితిలో ఉన్నారు. దేవుడా ఉన్నాడ్రా... మా కావ్య పాపనే ఏడిపిస్తారా..ఇప్పుడు తిక్క కుదిరిందిగా.. అంటూ ట్వీట్లు చేస్తున్నారు. మరి కొందురు.. కావ్య మారన్ కన్నీరు పెట్టడం వల్లే ఈ సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడిందని అంటున్నారు.






    పాయింట్ల టేబుల్‌లో సన్‌రైజర్స్ ప్రస్తుతం లాస్ట్ నుంచి ఫస్ట్‌లో ఉంటోంది. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌‌లను ఆడిన ఆ జట్టు గెలిచింది ఒక్క మ్యాచే. దాని ఖాతాలో ఉన్నవి రెండు పాయింట్లే. ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం వల్ల ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్లేఆఫ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలీ అంటే ప్రతి మ్యాచ్‌ను గెలిచి తీరాల్సిన పరిస్థితిని హైదరాబాద్ ఎదుర్కొంటోంది. ఇప్పుడు తాజాగా వచ్చిన బ్రేక్.. ఆ జట్టు పుంజుకోవడానికి మంచి అవకాశమే. మొత్తానికి ఐపీఎల్ వాయిదా.. కొన్ని జట్లకు బాధను కలిగిస్తే.. మరి కొన్ని జట్లకు సంతోషాన్ని కలిగిస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published: