లివింగ్ లెజండ్..సన్నీపై సచిన్ స్పెషల్ బర్త్‌డే ట్వీట్

ఇండియన్ క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్..సునీల్ గవాస్కర్‌కు క్రికెట్ ప్రపంచమంతా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది.సచిన్ టెండుల్కర్..సన్నీ‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ పోస్ట్ చేసిన ట్వీట్ క్రికెట్ అభిమానుల హృదయాలు గెలుచుకుంది.

news18-telugu
Updated: July 10, 2018, 2:23 PM IST
లివింగ్ లెజండ్..సన్నీపై సచిన్ స్పెషల్ బర్త్‌డే ట్వీట్
టెస్టుల్లో 10వేల పరుగుల మైలురాయి దాటిన తొలి బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించిన సునీల్ గవాస్కర్
  • Share this:
భారత మాజీ క్రికెట్ దిగ్గజం..సునీల్ గవాస్కర్ 69 వసంతాలు పూర్తి చేసుకున్నారు.లిటిల్ మాస్టర్‌గా..టెస్ట్‌ ఫార్మాట్‌లో ఆల్ టైమ్ గ్రేట్‌ క్రికెటర్‌గా సునీల్ గవాస్కర్ అభిమానులను అలరించారు.టెస్టుల్లో 10వేల పరుగులు స్కోర్ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా గవాస్కర్ చరిత్ర సృష్టించారు.మునుపటి తరంలో 34 టెస్ట్ సెంచరీలతో టెస్టుల్లో ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పారు.1983లో భారత జట్టు తొలి సారి వన్డే వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన జట్టులో సునీల్ గవాస్కర్ కీలక సభ్యుడు.అరుదైన రికార్డ్‌లతో,మిగతా క్రికెటర్లెవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచి..అంతర్జాతీయ క్రికెట్‌లో గవాస్కర్ తనదైన ముద్ర వేశారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌‌..సునీల్ గవాస్కర్‌కు తనదైన శైలిలోనే జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సన్నీకి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపింది.
First published: July 10, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు