Virat Kohli: విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలు.. ఆ పని ఒక్కసారి చెయ్యమంటూ సలహా చెప్పిన సునిల్ గవాస్కర్

వైఫల్యాల నుంచి బయటపడటానికి విరాట్ కోహ్లీకి గవాస్కర్ సలహా (PC: ICC)

గత కొన్నాళ్లుగా వరుస బ్యాటింగ్ వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీకి దిగ్గజ మాజీ క్రికెటర్ సునిల్ గవాస్కర్ అద్భుతమైన సలహా ఇచ్చారు. ఇంతకు గవాస్కర్ ఏమని చెప్పాడంటే..

 • Share this:
  ఇంగ్లాండ్ (England) పర్యటనలో ఉన్న భారత జట్టు (Team India) తొలి రెండు టెస్టుల్లో అద్బుతంగా రాణించింది. లార్డ్స్‌లో (The Lord's) జరిగిన రెండో టెస్టులో భారత జట్టు చారిత్రక విజయాన్ని కూడా అందుకున్నది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచినా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వరుస బ్యాటింగ్ వైఫల్యాలు మాత్రం అటు టీమ్ మేనేజ్‌మెంట్ సహా అభిమానులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నది. మూడో టెస్టులో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో చేతులెత్తేసింది. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకునే విషయంలో కోహ్లీకి మంచి రికార్డు ఉన్నది. ఎన్నో సార్లు ఒంటి చేత్తే ఇన్నింగ్స్‌లను చక్కదిద్దాడు. కానీ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 7 పరుగులకే అవుటయ్యాడు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శన అత్యంత పేలవంగా ఉన్నది. తొలి టెస్టులో డకౌట్ అయిన కోహ్లీ, రెండో టెస్టులో 42, 20 పరుగులు చేశాడు. కోహ్లీ అంతర్జాతీయ ఫార్మాట్‌లో సెంచరీ చేయక ఇప్పటికి 641 రోజులు అవుతున్నది. చివరి సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ సగటు కేవలం 23.00 మాత్రమే. అంతే కాకుండా అన్ని ఫార్మాట్లు కలిపి 50 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ చేసింది మూడు అర్దసెంచరీలు మాత్రమే. పరుగుల యంత్రం అని పేరు తెచ్చుకున్న కోహ్లీ వైఫల్యాలు భారత జట్టుకు కూడా భారంగా మారుతున్నాయి. కీలక సమయంలో వికెట్ పారేసుకోవడం అభిమానులను చికాకు పెడుతున్నది. రాబోయే టీ20 వరల్డ్ కప్ ముందు కోహ్లీ ఇలాంటి పేలవ ఫామ్‌లో ఉండటం జట్టుకు మంచిది కాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

  కోహ్లీ బ్యాటింగ్‌ చేసే సమయంలో ఆఫ్ స్టంప్ అవతల పడే బంతులను సరిగా జడ్జ్ చేయలేకపోతున్నాడు. ఈ బలహీనతను గ్రహించిన ఇంగ్లాండ్ బౌలర్లు, ముఖ్యంగా జేమ్స్ అండర్సన్ పదే పదే ఆఫ్ స్టంప్ అవతల బంతులు విసిరి కోహ్లీ వికెట్ రాబడుతున్నాడు. కోహ్లీ వైఫల్యంపై దిగ్గజ క్రికెటర్ సునిల్ గవాస్కర్ స్పందించారు. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫామ్ తనను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నదని చెప్పారు. కోహ్లీ ఆడుతున్న తీరు సరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆఫ్ స్టంప్ మీదకు వచ్చే బంతులను డ్రైవ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. ప్రతీ సారి ఇలా జరగడం ఏ బ్యాట్స్‌మాన్‌ను కూడా మంచిది కాదని గవాస్కర్ అన్నాడు. గతంలో సచిన్ టెండుల్కర్ కూడా ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కున్నాడు. 2003-04 సీజన్‌లో సచిన్ ఆఫ్ స్టంప్ బంతులను సరిగా జడ్జ్ చేయలేక విఫలమయ్యేవాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు టెస్టులలో సచిన్ ఇలాగే ఆఫ్ స్టంప్ బంతులకు అవుట్ అయ్యాడు. తొలి టెస్టులో 1, 37 పరుగులు.. రెండో టెస్టులో 0, 44 పరుగులకే పరిమితం అయ్యాడు. కానీ నెట్స్‌లో తీవ్రంగా సాధన చేసిన సచిన్ తన లోపాన్ని సరి చేసుకున్నాడని గవాస్కర్ గుర్తు చేశాడు.

  Unlucky Captain Kohli: టీమ్ ఇండియా చరిత్రలో విరాట్ కోహ్లీనే అన్ లక్కీ కెప్టెన్.. ఎలాగో తెలుసా?   విరాట్ కోహ్లీ ఒకసారి సచిన్‌కు కాల్ చేసి ఆ సమయంలో అతడు పడిన ఇబ్బందిని ఎలా అధిగమించాడో సలహా తీసుకుంటే మంచింది. సచిన్ నుంచి టెక్నిక్‌ను సరి చేసుకునే అవకాశం ఉన్నది. నాకు తెలిసి సచిన్ కచ్చితంగా కవర్ డ్రైవ్‌ల జోలికి వెళ్లవద్దు అనే సలహా ఇస్తాడని గవాస్కర్ చెప్పాడు. మనం ఏ షాట్ ఆడటంలో విఫలం అవుతున్నామో.. దాన్ని కొంత కాలం పక్కన పెట్టేయడం మంచిది అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. కాగా.. 2003-04లో సచిన్‌కు ఇలా సలహా ఇచ్చింది సునిల్ గవాస్కరే కావడం గమనార్హం. అప్పుడు గవాస్కర్ సూచనతోనే తన లోపాన్ని అధిగమించి మూడో టెస్టులో సచిన్ ఏకంగా డబుల్ సెంచరీ (241 పరుగులు) చేయడం విశేషం. మరి గవాస్కర్ సలహాను కోహ్లీ పాటిస్తాడో లేదో చూడాలి.

  Neeraj Chopra: ఒలింపిక్స్ ఫైనల్‌లో నీరజ్‌ను టెన్షన్ పెట్టిన పాకిస్తాన్ అథ్లెట్.. తొలి త్రోలో తక్కువ దూరం విసిరింది అందుకే..!  Published by:John Naveen Kora
  First published: