Watch: మాంచెస్టర్ స్టేడియంలో సునీల్ గవాస్కర్‌తో రణ్‌వీర్ డ్యాన్స్

Ind Vs Pak ICC Cricket World Cup 2019 | భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌తో కలిసి బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ స్టెప్స్ వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

news18-telugu
Updated: June 17, 2019, 5:22 PM IST
Watch: మాంచెస్టర్ స్టేడియంలో సునీల్ గవాస్కర్‌తో రణ్‌వీర్ డ్యాన్స్
సునీల్ గవాస్కర్‌తో రణ్‌వీర్ సింగ్ డ్యాన్స్...
news18-telugu
Updated: June 17, 2019, 5:22 PM IST
టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌తో కలిసి బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ మాంచెస్టర్ స్టేడియంలో సందడి చేశారు. మాంచెస్టర్‌ వేదికగా ఆదివారం భారత్‌-పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి స్టెప్పులేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్-పాక్ మధ్య మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగ సాగుతుండగా రణ్‌వీర్‌ సింగ్, సునీల్ గవాస్కర్ హిందీ పాటైన ‘బదాన్‌ పే సితారే’ పాటకు డ్యాన్స్ చేశారు. వీరి డ్యాన్స్‌పై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీరి డ్యాన్స్ సరాసరి భారత క్రీడాభిమాని సంతోషానికి అద్దం పట్టేలా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు.

ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 89 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించడం తెలిసిందే. రోహిత్ శర్మ(140) సూపర్ సెంచరీతో చెలరేగిపోగా...ఏ దశలోనూ భారత్‌కు పాక్ ధీటైన పోటీ ఇవ్వలేకపోయింది.

First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...