హోమ్ /వార్తలు /క్రీడలు /

KL Rahul - Suniel Shetty : " అల్లుడు నువ్వు అదుర్స్.. నా బర్త్ డే గిఫ్ట్ సూపరో సూపర్ "

KL Rahul - Suniel Shetty : " అల్లుడు నువ్వు అదుర్స్.. నా బర్త్ డే గిఫ్ట్ సూపరో సూపర్ "

Photo Credit : Instagram

Photo Credit : Instagram

KL Rahul - Suniel Shetty : ధనా ధన్ బ్యాటింగ్ కేరాఫ్ అడ్రస్ అయిన కేఎల్‌ రాహుల్‌ (KL Rahul), బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి (Suniel Shetty) ముద్దుల కూతురు అతియా (Athiya Shetty)తో ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే.వీరూ బాహటంగానే తిరిగినా.. తమ ప్రేమవ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.. అంగీకరించలేదు.

ఇంకా చదవండి ...

  ధనా ధన్ బ్యాటింగ్ కేరాఫ్ అడ్రస్ అయిన కేఎల్‌ రాహుల్‌ (KL Rahul), బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి (Suniel Shetty) ముద్దుల కూతురు అతియా (Athiya Shetty)తో ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే.వీరూ బాహటంగానే తిరిగినా.. తమ ప్రేమవ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.. అంగీకరించలేదు. కానీ, ఈ మధ్య జరుగుతున్న ఘటనలు చూస్తుంటే త్వరలోనే రాహుల్ - అతియాలు పెళ్లి పీటలు ఎక్కనున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయ్. ఇక, లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతోన్న రెండవ టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ (248 బంతుల్లో 127; 12 ఫోర్లు, సిక్స్‌) అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. లార్డ్స్‌లో సెంచరీ చేయాలని ఎంతో మంది క్రికెటర్లు కలకంటారు. అలాంటి స్టేడియంలో కేఎల్ రాహుల్ తన తొలి సెంచరీ నమోదు చేసి, మొత్తంమీద మూడో భారత ఓపెనర్‌గా నిలిచాడు. అతను సెంచరీ నమోదు చేసినప్పుడు తొటి ఆటగాళ్లతో సహా చాలామంది కేఎల్ రాహుల్‌కు శుభాకాంక్షలు అందించారు. సోషల్ మీడియాలో కూడా రాహుల్‌ను పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో రాహుల్ ప్రియురాలు అతియాశెట్టి, ఆమె తండ్రి ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా చేరారు

  ఇన్‌స్టా వేదికగా రాహుల్ సెంచరీ సెలెబ్రేషన్స్‌ను షేర్ చేసిన సునీల్ శెట్టి.. " క్రికెట్ మక్కాలో సెంచరీ చేసిన రాహుల్‌కు అభినందనలు. ఆ దేవుడి ఆశీర్వాదాలు నీకు ఉండాలి. నా బర్త్‌డే‌కు నువ్వు ఇచ్చిన ఈ గిఫ్ట్ అదిరిపోయింది " అంటూ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. అతియా శెట్టి సైతం రాహుల్ సెంచ‌రీపై పోస్ట్ చేసింది. కేఎల్ రాహుల్‌ను ట్యాగ్ చేస్తూ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఎరుపు రంగు హార్ట్ ఐకాన్‌ను పోస్ట్ చేసింది.


  అయితే ఈ పోస్ట్‌లపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రాహుల్-అతియా శెట్టిలు గత కొంతకాలంగా పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ జోడి తమ బంధంపై అధికారికంగా ఏ ప్రకటన చేయకపోయినప్పటికీ.. తమ మధ్య ఉన్నది ప్రేమేనని అర్థమయ్యేలా అనేక పనులు చేశారు. బాహటంగానే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. సోషల్ మీడియా వేదికగా లవ్ ఏమోజీలతో రచ్చ చేశారు. తాజా ఇంగ్లండ్ పర్యటనకు రాహుల్.. అతియా శెట్టిని కూడా తీసుకెళ్లాడు. బీసీసీఐకి సైతం తన ఫియాన్సీ అని చెప్పాడు. అక్కడ విరుష్క, ఇతర జంటలతో కలిసి ఈ జోడీ విరామ సమయాన్ని ఆస్వాదించింది.

  వీరి ప్రేమ పుకార్లపై సునీల్ శెట్టి సైతం చాలా సార్లు స్పందించాడు. వాళ్లు ఆనందంగా ఉంటే చాలు అంటూ కామెంట్ చేశాడు. ఈ క్రమంలోనే సునీల్ శెట్టి పోస్ట్ అభిమానులు తమదైన శైలిలో మార్చుతున్నారు. 'కంగ్రాట్స్ అల్లూడూ.. నా బర్త్‌డే గిఫ్ట్ అదిరింది'అనే అర్థంలోనే సునీల్ శెట్టి కామెంట్ చేశాడని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Bollywood news, Cricket, India vs england, KL Rahul, Sunil Shetty

  ఉత్తమ కథలు