Home /News /sports /

SUN RISERS HYDERABAD IPL 2022 UPDATES TEAM BHUVI BEAT TEAM KANE IN PRACTICE MATCH AHEAD OF 2022 IPL SEASON SJN

Sunrisers Hyderabad : కేన్ మామను చిత్తు చేసిన భువనేశ్వర్ కుమార్ ! ఎందులో అంటే?

కేన్ విలియమ్సన్ (PC: SRH)

కేన్ విలియమ్సన్ (PC: SRH)

Sunrisers Hyderabad : గతేడాది జరిగిన ఐపీఎల్ లో ఆడిన 14 మ్యాచ్ ల్లో కేవలం 3 మ్యాచ్ ల్లోనే గెలిచిన హైదరాబాద్ ఆఖరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే కేన్ విలియమ్సన్ సారథ్యంలోని సన్ రైజర్స్ ఈ ఏడాది మాత్రం రైజ్ అయ్యేందుకు సిద్ధమైంది.

ఇంకా చదవండి ...
Sunrisers Hyderabad : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభం కావడానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. మార్చి 26న జరిగే తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ చెన్న సూపర్ కింగ్స్ (Chennai super kings)ను రన్నరప్ కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight riders) ఢీ కొనబోతుంది.  రెండు రోజుల అనంతరం కేన్ విలియమ్సన్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers hyderabad) జట్టు రాజస్తాన్ రాయల్స్ (Rajastan Royals) తో తలపడనుంది. కరోనా వల్ల ఈ ఏడాది జరిగే ఐపీఎల్ మహారాష్ట్ర వేదికగా జరగనుంది. ముంబై లోని మూడు వేదికలు... పుణేలోని ఒక వేదికలో మొత్తం 70 లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్రకు అన్ని జట్లు కూడా చేరుకున్నాయి. ఈ ఏడాది నుంచి మరో రెండు జట్లు కూడా యాడ్ అవుతుండటంతో లీగ్ ఫార్మాట్ కాస్త మారింది.

గతేడాది జరిగిన ఐపీఎల్ లో ఆడిన 14 మ్యాచ్ ల్లో కేవలం 3 మ్యాచ్ ల్లోనే గెలిచిన హైదరాబాద్ ఆఖరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే కేన్ విలియమ్సన్ సారథ్యంలోని సన్ రైజర్స్ ఈ ఏడాది మాత్రం రైజ్ అయ్యేందుకు సిద్ధమైంది. అందుకు తగ్గట్లే మైదానంలో శ్రమిస్తోంది. రియల్ మ్యాచ్ ల కంటే కూడా ముందుగా పలు ప్రాక్టీస్ మ్యాచ్ లను ఆడుతూ కనిపిస్తోంది.

ఈ క్రమలో సన్ రైజర్స్ జట్టు రెండు గ్రూపులుగా విడిపోయింది. ఒక జట్టుకు కేన్ మామ సారథిగా ఉంటే మరో జట్టుకు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్ గా వ్యవహరించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ కేన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 146  పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 25 బంతుల్లో 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ప్రియమ్ గార్గ్ (26 బంతుల్లో 29) పరుగులు చేశాడు. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీయగా... విండీస్ బౌలర్ రొమారియో షెపర్డ్ 1 వికెట్ తీశాడు. అయితే అతడు మూడు ఓవర్లు వేసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు.



అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమ్ భువీ 15 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. అయినప్పటికీ బ్యాటర్లకు ప్రాక్టీస్ కల్పించేందుకు 20 ఓవర్ల పాటు ఆడింది. టీమ్ భువీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (30 బంతుల్లో 45), భారత ప్లేయర్ ఆర్ సమర్థ్ (22 బంతుల్లో 41) ధనాధన్ షాట్లతో ఆడారు. కేన్ టీమ్ నుంచి ఉమ్రన్ మాలిక్ 2 వికెట్లు తీశాడు. దూబే ఒక వికెట్ సాధించాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Kolkata Knight Riders, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు