• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • SUN RISERS CAPTAIN DAVID WARNER GIVES UPDATE ON HIS INJURY HE WOULD LIKE TO PLAY ON MARCH 4 SRD

David Warner : తన గాయంపై క్లారిటీ ఇచ్చిన డేవిడ్ వార్నర్..ఇంతకీ ఐపీఎల్ ఆడతాడా..

David Warner : తన గాయంపై క్లారిటీ ఇచ్చిన డేవిడ్ వార్నర్..ఇంతకీ ఐపీఎల్ ఆడతాడా..

david warner (ఫైల్ ఫోటో)

David Warner : ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డేవిడ్ వార్నర్.. ఆ జట్టుకు ప్రధాన బలమనే చెప్పాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టును నడిపించగలిగే సత్తా వార్నర్ సొంతం. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు వార్నర్ దూరం కానున్నడానే వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డేవిడ్ వార్నర్.. ఆ జట్టుకు ప్రధాన బలమనే చెప్పాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టును నడిపించగలిగే సత్తా వార్నర్ సొంతం. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు వార్నర్ దూరం కానున్నడానే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ పరిస్థితుల నేపథ్యంలో మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్-14 సీజన్‌లో వార్నర్ ఆడతాడా లేదా ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న వార్నర్‌ను ఐపీఎల్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతించకపోవచ్చనే ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చాడు వార్నర్. తన గాయంపై స్పష్టత ఇచ్చాడు వార్నర్.గాయం తీవ్రత మరో కొన్ని నెలలు ఉంటుందని, అప్పటివరకు మైదానాన్ని వీడాల్సిన అవసరం లేదని తెలిపాడు. వచ్చే నెలలోనే బరిలోకి దిగుతున్నట్లు ట్వీట్ చేశాడు. "నిన్న రాత్రి నేను చేసిన వ్యాఖ్యలకు స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. గజ్జల్లో నొప్పిని పూర్తిగా అధిగమించడానికి కనీసం మరో ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది. కానీ మార్చి 4 నుంచే న్యూసౌత్‌వేల్స్‌ జట్టు తరఫున తిరిగి బరిలోకి దిగుతున్నా" అని వార్నర్‌ ట్వీట్ చేశాడు. ఈ వ్యాఖ్యలతో వార్నర్‌ ఐపీఎల్‌ ఆడతాడని స్పష్టంగా తెలుస్తోంది.


    అయితే, భారత్‌తో జరిగిన రెండో వన్డేలో వార్నర్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తుండగా గజ్జల్లో గాయమవ్వడంతో నొప్పితో విలవిలలాడుతూ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత టీ20 సిరీస్‌కు దూరమైనా, చివరి రెండు టెస్టులకు తిరిగొచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమయ్యాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు