హోమ్ /వార్తలు /క్రీడలు /

Pak vs NZ: పాక్​పై తడబడిన విలియమ్సన్​ సేన.. 20 ఓవర్లలో న్యూజిలాండ్​​ ఎన్ని పరుగులు చేసిందంటే

Pak vs NZ: పాక్​పై తడబడిన విలియమ్సన్​ సేన.. 20 ఓవర్లలో న్యూజిలాండ్​​ ఎన్ని పరుగులు చేసిందంటే

పాక్​ బౌలర్​ రవూప్​  (Photo: ICC/twitter)

పాక్​ బౌలర్​ రవూప్​ (Photo: ICC/twitter)

ఐసీసీ టీ 20 ప్రపంచకప్ (ICC T20 world cup)​లో పాకిస్తాన్​ (Pakistan)తో జరిగిన మ్యాచ్​లో విలియమ్సన్ (Williamson)​ సేన తడబడింది. ఆరంభంలో  వికెట్లు పడటంతో 20 ఓవర్లలో 8 వికెట్టు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఐసీసీ టీ 20 ప్రపంచకప్ (ICC T20 world cup)​లో పాకిస్తాన్​ (Pakistan)తో జరిగిన మ్యాచ్​లో విలియమ్సన్ (Williamson)​ సేన తడబడింది. ఆరంభంలో  వికెట్లు పడటంతో 20 ఓవర్లలో 8 వికెట్టు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది.  13 ఓవర్ల వరకు 90 పరుగులతో బాగానే ఆడింది. అయితే చివరలో వచ్చిన బ్యాట్స్​మన్​ నిలవకపోవడంతో  న్యూజిలాండ్ (new Zealand)​ తక్కువ స్కోరుకే పరిమితమైంది. చెల్​ 20 బంతుల్లో 27 పరుగులు చేశాడు.

మొదట బ్యాటింగ్​ చేసిన న్యూజిలాండ్​ (new Zealand)​  జట్టుకు ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. కుదురుకుంటున్నక్రమంలో 36 పరుగుల వద్ద మార్టిన్ గప్టిల్ (17) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ (new Zealand)​ ఏ దశలోనూ దూకుడు ప్రదర్శించలేకపోయింది. 54 పరుగుల వద్ద డరిల్ మిచెల్ (27), 56 పరుగుల వద్ద జేమ్స్ నీషమ్ (1) అవుట్ కావడంతో జట్టు కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఈ దశలో క్రీజులో కుదురుకున్నట్టు కనిపించిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ .. కాన్వేతో కలిసి జట్టును చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

ఇద్దరు కలిసి నిదానంగా (slow) ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. అయితే పాక్ బౌలర్ల ముందు వారి ఆటలు సాగలేదు. 25 పరుగులు చేసిన విలియమ్సన్ రనౌట్‌గా వెనుదిరగ్గా, 27 పరుగులు చేసిన కాన్వే.. హరీస్ రవూఫ్ బౌలింగు (bowling)లో పెవిలియన్ చేరాడు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు (runs) చేయలేదు. ఫలితంగా న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 134 పరుగుల వద్ద ముగిసింది. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ (Rauf) నాలుగు వికెట్లు తీసుకోగా, షహీన్ అఫ్రిది (Shahin Afridi), ఇమాద్ వాసిమ్, హఫీజ్ చెరో వికెట్ తీసుకున్నారు.

అయితే లక్ష్య చేధనలో భరిలోకి దిగిన పాకిస్తాన్‌ తడబుతోంది. టీమిండియాపై చెలరేగిన రిజ్వాన్‌ 33 పరుగుల వద్ద, అజమ్‌ 9 పరుగుల వద్దే వెనుతిరిగారు. దీంతో పాకిస్తాన్‌ స్కోరు బోర్డు నెమ్మదించింది.

ఇక అనంతరం క్రీజులోకి వచ్చిన జమన్, హఫీజ్‌ కూడా వెంట వెంటనే పెవిలయన్‌ బాటపట్టారు. ఇక పాకిస్తాన్‌ ప్రస్తుతం 14.5 ఓవర్లకుగాను 5 వికెట్లు కోల్పోయి 87 పరుగుల వద్ద కొనసాగుతోంది. మరి న్యూజిలాండ్‌ ఇచ్చిన లక్ష్య చేధనను పాకిస్తాన్‌ అందుకుంటుందో లేదో వేచి చూడాలి.

First published:

Tags: Cricket, ICC, ICC Women T 20 World Cup 2020, New Zealand, Pakistan

ఉత్తమ కథలు