స్మిత్ ఎందయ్యా ఈ చీటింగ్‌.. పాపం అతని మోసం తెలియని పంత్..

_Steve Smith usin

ఆస్ట్రేలియా క్రికెటర్స్‌కు చీటింగ్‌ చేయడం పరపాటిగా మారిపోయింది. తాజాగా పంత్‌ బ్యాటింగ్‌ చేసే క్రమంలో ఆ జట్టు టాప్ క్రికెటర్ స్మిత్‌ తనదైనా శైలిలో మెసానికి పాల్సడ్డాడు. స్ట్రైక్‌లో బ్యాటింగ్ చేస్తున్న బాట్స్‌మెన్ లెగ్‌ స్టిక్‌, మిడిల్‌ స్టిక్‌ నిర్ణయించుకుని అంపైర్‌ను గార్డ్‌ కొరడం కామన్

  • Share this:
    ఆస్ట్రేలియా క్రికెటర్స్‌కు చీటింగ్‌ చేయడం పరపాటిగా మారిపోయింది. తాజాగా పంత్‌ బ్యాటింగ్‌ చేసే క్రమంలో ఆ జట్టు టాప్ క్రికెటర్ స్మిత్‌ తనదైనా శైలిలో మెసానికి పాల్సడ్డాడు. స్ట్రైక్‌లో బ్యాటింగ్ చేస్తున్న బాట్స్‌మెన్ లెగ్‌ స్టిక్‌, మిడిల్‌ స్టిక్‌ నిర్ణయించుకుని అంపైర్‌ను గార్డ్‌ కొరడం కామన్. అయితే మూడో టెస్ట్ మ్యా్చ్‌లో పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గార్డ్‌ మార్క్‌లను స్మిత్‌ మార్చేశాడు. మ్యాచ్‌లో చిన్నపాటి విరామం దొరికిన సమయంలో స్మిత్‌ పంత్‌ బ్యాటింగ్‌ గార్డ్‌ను చెరిపేసి కొత్త గార్డ్‌ గీశాడు. ఈ కుట్రపూరిత ధోరణిపై క్రికెట్ అభిమానలు మండిపడుతున్నారు. కెమెరాల్లో రికార్డయ్యన దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ స్మీత్‌పై విరుచుపడుతున్నారు. రికార్డు అయిన వీడియో దృశ్యాలు సరిగ్గా కనిపించకపోయిన స్మితే గార్డ్‌ మార్చుస్తున్న విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ విషయం తెలియని పంత్ స్మిత్‌ ఏదైతే గార్డ్‌ గీశాడో దాన్ని బట్టే బ్యాటింగ్‌ చేశాడు. ఈ విషయంపై సోషల్‌ మీడియాలో నెటిజన్స్ మెుదలుపెట్టారు.    ఈ తరహా మోసాలు పాల్పడడం స్మీత్ కొత్తమి కాదు. గతంలో టీమిండియాతో ఆడిన మ్యాచ్‌లో ఎల్బీ రివ్యూ కోరే సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌కు సైగ చేశాడు. ఇక 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్‌ టాంపరింగ్‌ చేశాడు. దీంతో ఈ వివాదం అప్పట్లో త్రీవ వివాదాన్ని సృష్టించింది. బాల్‌ టాంపరింగ్‌ వివాదం కారణంగా స్మీత్‌తో పాటు వార్నర్ ఏడాది పాటు నిషేదానికి గురయ్యారు. తాజాగా స్మీత్ చేసిన మోసంతో మళ్ళీ ఆస్ట్రేలియా క్రికెటర్స్ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చీటర్స్‌ ఎప్పుడూ చీటర్సే ఆసీస్ క్రికెటర్స్ ఎప్పుడూ చీటర్స్‌ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
    Published by:Rekulapally Saichand
    First published: