విరాట్ కోహ్లీ vs స్టీవ్ స్మిత్... వరల్డ్స్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌ ఎవరు?

Steve Smith or Virat Kohli : ఇప్పుడున్న పరిస్థితుల్లో బెస్ట్ బ్యాట్స్‌మన్ ఎవరన్నది ఎవరూ తేల్చలేకపోతున్నారు. మరి ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ అభిప్రాయమేంటో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 7, 2019, 8:06 AM IST
విరాట్ కోహ్లీ vs స్టీవ్ స్మిత్... వరల్డ్స్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌ ఎవరు?
విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్
  • Share this:
యాషెస్ సిరీస్‌లో... మూడు టెస్టుల్లో 479 రన్స్... యావరేజ్‌న ప్రతీ మ్యాచ్‌లో 159.66 రన్స్.... ఇదీ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్... తాజా విజృంభణ. శాండ్ పేపర్ గేట్ వివాదంలో ఏడాది పాటూ నిషేధాన్ని ఎదుర్కొన్న స్టీవ్... తిరిగి టెస్ట్ ఎరెనాలో అడుగుపెట్టి దుమ్మురేపుతున్నాడు. గురువారం డబుల్ సెంచరీ చెయ్యడంతో... తను టీమిండియా నంబర్ వన్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని వెనక్కినెట్టాడు. ఐతే... స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీలో... ప్రపంచ బెస్ట్ బ్యాట్స్‌మన్ ఎవరన్న డిబేట్‌కి తెరపడలేదు. లెజెండరీ ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్... షేన్ వార్న్... తనను గనక ఎంపిక చెయ్యమంటే... స్టీవ్ స్మిత్‌కి కాస్త అడ్వాంటేజ్ ఉంటుందనీ... తన ఫేవరెట్ మాత్రం కోహ్లీ అని చెప్పాడు. అన్ని ఫార్మాట్లనూ దృష్టిలో పెట్టుకొని తాను ఇలా అంటున్నానని చెప్పాడు.

టెస్ట్ క్రికెట్ ఉన్నంతకాలం... విరాట్ కోహ్లీ, స్మిత్ మధ్య పోరు అలాగే ఉంటుందని షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. టెస్ట్ క్రికెట్ విషయంలో మాత్రం తాను స్టీవ్ స్మిత్‌ని ఎంపిక చేస్తానని తెలిపాడు. అతని బదులు విరాట్‌ తెరపైకి వచ్చినా... తనకు ఆనందంగానే ఉంటుందన్నాడు... విరాట్‌ను లెజెండ్ అని అభివర్ణించాడు.

"ప్రపంచంలో బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ని భావిస్తున్నాను. అన్ని ఫార్మాట్లలోనూ... బెస్ట్ బ్యాట్స్‌మన్ ఎవరంటే మాత్రం అది విరాటే అవుతాడు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వివ్ రిచర్డ్స్ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మన్. ఇప్పుడు మాత్రం వన్డే ఇంటర్నేషనల్‌లో విరాటే బెస్ట్. ఇంకా చెప్పాలంటే... వివ్ రిచర్డ్స్‌ని అతను దాటేశాడు"
షేన్ వార్న్.


క్రికెట్‌లో బెస్ట్ బౌలర్లను విరాట్ దాటిగా ఎదుర్కోగలిగాడని షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. విరాట్ అన్ని రికార్డులనూ బ్రేక్ చేశాడన్న వార్న్... అతని దూకుడు చూసి ఫ్యాన్ అయ్యానన్నాడు. అన్ని ఫార్మ్స్‌నీ దృష్టిలో పెట్టుకొని విరాట్‌ను వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎంపిక చేయవచ్చన్నాడు. కెప్టెన్‌గా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా... బ్యాట్స్‌మన్‌గా మాత్రం... విరాట్ కోహ్లీ ఎన్నో అద్భుతాలు సాధించాడని ప్రశంసించాడు. ఐతే... విరాట్ కోహ్లీ నేర్చుకోవాల్సింది కూడా ఇంకా చాలా ఉందనీ... కెప్టెన్‌గా చాలా ట్రిక్కులు తెలుసుకోవాలని సూచించాడు.
First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>