బిగ్‌బ్యాష్ లీగ్‌లో స్టీవ్ స్మిత్ బిగ్‌బ్యాంగ్ ఎక్స్‌ప్లోషన్ కంటిన్యూ అవుతోంది. ఇదేం బాదుడు రా బాబు అని ప్రత్యర్థులతో పాటు క్రికెట్ అభిమానులూ అనుకునేలా స్మిత్ ఊచకోత కొనసాగుతోంది. సిడ్నీ సిక్సర్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న ఈ లెజెండ్.. తనలోని హిట్టింగ్ యాంగిల్‌ను ప్రపంచానికి చూపిస్తున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలతో చెలరేగిన స్మిత్ మరోసారి సుడిగాలి ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 33బంతుల్లోనే 66పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్ల భరతం పట్టాడు. స్మిత్ బాదుడుకి హోబర్ట్ టీమ్‌కి గ్రౌండ్‌లోనే హరికేన్ కనిపించినట్లైంది. స్మిత్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండగా.. తన హాఫ్ సెంచరీకి కేవలం 22 బంతులే తీసుకున్నాడు. టీ20 కెరీర్‌లో స్మిత్‌కు ఇదే వేగవంతమై హాఫ్ సెంచరీ. ఇక దాదాపు 12 ఏళ్లగా బిగ్‌బ్యాష్ లీగ్ ఆడుతున్న స్మిత్ ఖాతాలో 5రోజుల ముందు వరకు ఒక్క సెంచరీ కూడా లేకపోగా.. ఇప్పుడు రెండు సెంచరీలు ఉండడంతో విమర్శకుల నోళ్లకు తాళం పడింది.
15 runs off one legal delivery! ????????
Steve Smith's cashing in once again in Hobart ????#BucketBall #BBL12 pic.twitter.com/G3YiCbTjX7 — KFC Big Bash League (@BBL) January 23, 2023
ఒక్క బంతికి 16పరుగులు..! ఇది ఎలా సాధ్యమనుకుంటున్నారా..? బౌలర్ తప్పిదం.. బ్యాటర్ విధ్వంసం కలిస్తే సాధ్యమే..! సిడ్ని సిక్సర్స్ ఇన్నింగ్స్‌లోనూ ఇదే జరిగింది. కేవలం ఒక్క లీగల్ డెలవరీకి 16పరుగులు వచ్చాయి.హోబర్ట్ హరికేన్స్ బౌలర్ జోయెల్ పారిస్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో మూడో బంతిని జోయెల్ నో బాల్ వేయగా.. స్మిత్ దాన్ని సిక్సర్ కొట్టాడు. దీంతో ఆ బంతికి ఏడు పరుగులు వచ్చినట్లైంది. అయితే తర్వాతి బంతిని జోయెల్ వైడ్ వేయగా.. అది కీపర్ వేడ్‌కు చాలా దూరంగా వెళ్తూ.. ఫైన్ లెగ్ రీజియన్ వద్ద బౌండరీని తాకింది. ఈ బంతికి ఐదు పరుగులు యాడ్ అయ్యాయి. ఆ తర్వాతి బంతిని స్మిత్ బౌండరీకి తరలించాడు. మొత్తం 7+5+4 చొప్పున ఒక్క బంతికే 16 పరుగులు వచ్చినట్లైంది. ఇలా స్టార్టింగ్‌లోనే స్మిత్‌తో పాటు సిడ్ని సిక్సర్స్‌కూ అదిరిపోయే ఆరంభం లభించింది.
స్మిత్ భికర ఫామ్.. మరో 15రోజుల్లో ఇండియాతో సిరీస్:
ప్రతిష్టాత్మక బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి ముందు స్మిత్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదడంతో ఆస్ట్రేలియా రెట్టించిన ఉత్సాహంతో ఉండగా.. భారత్ ఈ మాజీ కెప్టెన్ ఫామ్‌పై ఓ కన్నేసి ఉంచింది. ఫిబ్రవరి 9న భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ నాగ్‌పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భారత్ మూడు టెస్టులు గెలవాల్సి ఉంది. 3-0 లేదా 3-1 తేడాతో విజయం సాధిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధిస్తుంది. ఇక ఇదే సమయంలో అటు స్మిత్ భికర ఫామ్‌తో చెలరేగుతుండడంతో అతడిని కట్టడి చేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేసుకోవాల్సిన అవసరముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Steve smith