కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్...

స్టీవ్ స్మిత్ వేగంగా 25 టెస్ట్ సెంచరీలు నమోదు చేసిన రెండో బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. అయితే స్టీవ్ స్మిత్ ఈ రికార్డును 119 ఇన్నింగ్స్‌లలో అందుకోగా, టీమిండియా సారథి విరాట్ కోహ్లీ 127 ఇన్నింగ్స్‌లలో 25 సెంచరీలు నమోదు చేశాడు.

news18-telugu
Updated: August 4, 2019, 9:42 PM IST
కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్...
స్టీవ్ స్మిత్ (Image : Twitter)
  • Share this:
ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ టెస్టు మ్యాచుల్లో అత్యంత వేగంగా 25 టెస్టు సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. కాగా ఆసీస్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ ఈ రేసులో మొదటి స్థానంలో ఉండటం విశేషం. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో స్టీవ్ స్మిత్ రెండో ఇన్నింగ్స్ లో సైతం స్మిత్ 142 పరుగులతో సెంచరీ సాధించడం ద్వారా ఈ రికార్డు మైలురాయిని అందుకున్నాడు. అయితే అంతకు మునుపు తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ 144 పరుగులు చేయడం విశేషం. ఒకే టెస్టు మ్యాచులో రెండు ఇన్నింగ్స్ లో వరుసగా రెండు సెంచరీలు చేశాడు. కాగా ఈ సెంచరీలతో స్మిత్ వేగంగా 25 టెస్ట్ సెంచరీలు నమోదు చేసిన రెండో బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. అయితే స్టీవ్ స్మిత్ ఈ రికార్డును 119 ఇన్నింగ్స్‌లలో అందుకోవడం విశేషం. ఇదిలా ఉంటే టీమిండియా సారథి విరాట్ కోహ్లీ 127 ఇన్నింగ్స్‌లలో 25 సెంచరీలు నమోదు చేయగా, స్టీవ్ స్మిత్ మాత్రం కోహ్లీ కన్నా 8 ఇన్నింగ్స్‌ల ముందుగానే స్మిత్ ఈ ఘనత సాధించాడు. 68 ఇన్నింగ్స్‌లలో 25 సెంచరీలు చేసిన డాన్ బ్రాడ్‌మన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు.
First published: August 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading