కోహ్లీ స్థానానికి ఎసరు పెట్టేందుకు సిద్ధమౌతున్న ఆసీస్ ఆటగాడు స్మిత్...

టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, స్టీవ్ స్మిత్‌ సైతం కోహ్లీకి సమీపంలో ఉన్నాడు. ఇద్దరి మధ్య కేవలం తొమ్మిది పాయింట్ల తేడానే ఉంది.

news18-telugu
Updated: August 20, 2019, 10:17 PM IST
కోహ్లీ స్థానానికి ఎసరు పెట్టేందుకు సిద్ధమౌతున్న ఆసీస్ ఆటగాడు స్మిత్...
స్టీవ్ స్మిత్ (Image: Cricket Next)
  • Share this:
వరల్డ్ కప్‌ టోర్నీ ద్వారా ఆస్ట్రేలియా జట్టులో పునరాగమనం చేసిన స్టీవ్ స్మిత్‌ రికార్డులు తిరగరాసే పనిలో పడ్డాడు. యాషెస్ సిరీస్ లో వరుస సెంచరీల మోతతో మరోసారి అగ్రస్థానం మీద కన్నేశాడు. తాజాగా ప్రకటించిన టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, స్టీవ్ స్మిత్‌ సైతం కోహ్లీకి సమీపంలో ఉన్నాడు. ఇద్దరి మధ్య కేవలం తొమ్మిది పాయింట్ల తేడానే ఉంది. ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో స్టీవ్ స్మిత్‌ రెండో స్థానంలో నిలవగా, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మూడో స్థానంలో నిలిచాడు. అయితే కోహ్లి మాత్రం 922 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు.యాషెస్‌ సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్న స్మిత్‌ 913 పాయింట్లతో కోహ్లీ వెనకే ఉన్నాడు.

ఇక కేన్‌ విలియమ్సన్‌ 887 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా, పుజారా 4వ స్థానంలో నిలవడం విశేషం. ఇక బౌలర్లలో ప్యాట్‌ కమిన్స్‌ టాప్ ర్యాంక్ సాధించాడు. భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజా ఐదో ర్యాంకులో నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో మాత్రం జడేజా మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక టెస్ట్ క్రికెట్ టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 113 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>