దుమ్మురేపిన స్టీవ్ స్మిత్... 73 ఏళ్ల రికార్డ్ బ్రేక్...

Steve Smith : రికార్డులు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఒకరు నెలకొల్పిన రికార్డును మరొకరు బద్ధలు కొడతారు. కాకపోతే... 73 ఏళ్లుగా బ్రేక్ కాని రికార్డును స్టీవ్ స్మిత్ బ్రేక్ చెయ్యడం విశేషమే.

news18-telugu
Updated: November 30, 2019, 12:18 PM IST
దుమ్మురేపిన స్టీవ్ స్మిత్... 73 ఏళ్ల రికార్డ్ బ్రేక్...
(credit - ANI)
  • Share this:
Steve Smith : ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్... టెస్టుల్లో అత్యంత వేగంగా 7,000 రన్స్ చేసి... 73 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న పాత రికార్డును శనివారం బద్ధలుకొట్టాడు. ఇందుకు ఆస్ట్రేలియా... అడిలైడ్ ఓవల్ స్టేడియం వేదికైంది. ప్రస్తుతం అక్కడ పాకిస్థాన్‌తో పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు జరుగుతోంది. తన 126వ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్.. ఈ 7,000 పరుగులు చేశాడు. ఈ ఫీట్ ద్వారా... ఇంగ్లండ్‌కి చెందిన వాలీ హమ్మండ్ పేరుతో ఉన్న రికార్డును స్టీవ్ బ్రేక్ చేశాడు. హమ్మండ్... తన 131 ఇన్నింగ్స్‌లో 7,000 రన్స్ చేశాడు. ఎప్పుడో 73 ఏళ్ల కిందట సాధించిన ఈ రికార్డును ఇప్పటివరకూ ఎవరూ బ్రేక్ చెయ్యలేకపోయారు. ఐతే... 30 ఏళ్ల స్మిత్... రికార్డ్ బ్రేక్ చేసేందుకు 23 రన్స్ కావాల్సి ఉండగా... ఆట మొదలుపెట్టాడు. ఈ ఫీట్ ద్వారా మరో ఘనత కూడా సాధించాడు. ఆస్ట్రేలియా రన్ స్కోరింగ్ లిస్టులో... డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ను వెనక్కు నెట్టాడు. బ్రాడ్‌మన్... టెస్టుల్లో 6,996 రన్స్ చేశాడు.

ఇండియన్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్... 134 ఇన్నింగ్స్, సచిన్ టెండుల్కర్ 136వ ఇన్నింగ్స్‌లో 7,000 రన్స్ చేశారు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ సర్ గార్ఫీల్డ్ సోబెర్స్... తన 138వ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించాడు. ఇక మన సునీల్ గవాస్కర్... 140వ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరాడు. అందువల్ల స్టీవ్ స్మిత్ కొత్త రికార్డును తన పేరును రాసుకున్నాడు.


Pics : రియల్ లైఫ్ బార్బీ గర్ల్ అంజెలికా క్యూట్ ఫొటోస్ఇవి కూడా చదవండి :

శంషాబాద్‌లో మరో మహిళ మృతదేహం... సూసైడ్‌గా అనుమానాలు

BSNL : రోజూ 3 జీబీ డేటాతో బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్


మీ గ్రామ వాలంటీర్ ఎవరో తెలియట్లేదా... ఇలా చెయ్యండి

భర్తను నరికి చంపిన భార్య... కారణం ఇదీ...

ప్రజలను మోసంచేస్తున్న ఎలుగుబంటి... డాన్స్ చేస్తూ...
Published by: Krishna Kumar N
First published: November 30, 2019, 12:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading