Home /News /sports /

STEFFAN NERO SMASHES TRIPLE CENTURY IN THE AUSTRALIAN BLIND CRICKET TEAMS FIRST ODI AGAINST NEW ZEALAND WATCH SRD

Triple Century : 140 బంతుల్లో 309 పరుగులు.. వన్డేల్లో అద్భుతం.. ఇది మాములు బాదుడు కాదు..

Steffan Nero (PC : Twitter)

Steffan Nero (PC : Twitter)

Triple Century : 140 బంతులు.. 49 ఫోర్లు, 1 సిక్సర్.. 309 పరుగులు.. ఈ గణంకాలు చూస్తేనే అర్ధమవుతోంది ఆ బ్యాటర్ ఎంతటి విధ్వంసం సృష్టించాడో.

    ఆధునిక క్రికెట్ (Cricket) లో సెంచరీ, డబుల్ సెంచరీలు చూస్తూనే ఉన్నాం. కానీ, ట్రిపుల్ సెంచరీ(Triple Century) చేయడం గగనంగా మారింది. టెస్ట్ ఫార్మాట్(Test Format) లో తప్ప లిమిటెట్ క్రికెట్ లో ఈ ఫీట్ సాధించడం కత్తిమీద సామే అని చెప్పాలి. కానీ, ఆస్ట్రేలియా క్రికెటర్(Australia Cricketer) స్టెఫాన్ నీరో (Steffan Nero) మాత్రం తన రూటే సపరేటు అన్న విధంగా వన్డే క్రికెట్ లో చెలరేగి సరికొత్త ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు. అంధుల వన్డే క్రికెట్‌ (Blind Odi Cricket)లో ట్రిపుల్‌ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. కామన్‌వెల్త్‌ బ్యాంక్‌ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో నీరో ఈ రికార్డు క్రియేట్ చేశాడు. కేవలం 140 బంతుల్లో 49 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 309 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీ20ల ప్రభావంతో వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేయడమే కష్టమైన ప్రస్తుత రోజుల్లో ఓ అంధ క్రికెటర్‌ ట్రిపుల్‌ సాధించడం విశేషం.

    నీరో వీరోచిత బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా నిర్ణీత 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 542 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ తర్వాత ఛేజింగ్ కు దిగిన కివీస్‌ కేవలం 272 పరుగులకే చేతులేత్తేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా 270 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఇక, ఈ భారీ సెంచరీతో కొన్ని అరుదైన రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు నీరో.



    అంధుల వన్డే క్రికెట్‌ చరిత్రలో ట్రిపుల్‌ సెంచరీ సాధించడంతో స్టెఫాన్ నీరో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. 1998లో పాకిస్తాన్ బ్యాటర్ మసూద్ జాన్ చేసిన 262 పరుగులే అంధుల వన్డే క్రికెట్‌లో ఇప్పటి వరకు టాప్‌ స్కోర్‌గా ఉండగా.. లేటెస్ట్ గా నీరో దాన్ని అధిగమించాడు. అంధుల వన్డే క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నీరో రికార్డులోకి ఎక్కాడు. 5 టీ20లు, 3 వన్డేల ఈ సిరీస్‌లో నీరో ఇప్పటికే రెండు సెంచరీలు (113, 101) నమోదు చేశాడు.


    దీంతో పాటు.. స్టెఫాన్ నీరో మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ట్రిపుల్‌ సెంచరీ (బాదిన ఎనిమిదో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో మాథ్యూ హేడెన్, మైకేల్ క్లార్క్, డేవిడ్ వార్నర్, మార్క్ టేలర్, బాబ్ కౌపర్, బాబ్ సింప్సన్, డోనాల్డ్ బ్రాడ్‌మాన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు వివిధ ఫార్మాట్లలో ట్రిపుల్ సెంచరీలు సాధించారు. ఇక, స్టెఫాన్ నీరో ట్రిపుల్ సెంచరీ ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లు ఆశ్చర్యంతో పాటు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Australia, Cricket, Newzealand, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు