ఐపీఎల్ 2021 (IPL 2021) సందడి మొదలైంది. క్రికెట్ (Cricket) మ్యాచ్ మొత్తం ఒక ఎత్తైతే.. టీవీ ప్రేక్షకులను కట్టిపడేసేలా మ్యాచ్ ముందు, తర్వాత టీవీల్లో ప్రసారం అయ్యే షోను స్టార్ స్పోర్ట్స్ (Star Sports) ప్రసారం చేస్తుంది. ప్రీ మ్యాచ్, పోస్ట్ మ్యాచ్ షోను 8 భాషల్లో అందిస్తున్నట్లు స్టార్ గ్రూప్ తెలిపింది. దీనికి సంబంధించిన యాంకర్ల (Hosts)(Anchors) జాబితాను బ్రాడ్‌కాస్టర్ విడుదల చేసింది. కరోనా కారణంగా మ్యాచ్‌లు కేవలం 6 నగరాలకే పరిమితం కావడంతో స్టార్ స్పోర్ట్స్ షోలు అన్నీ ఆయా నగరాల నుంచే ప్రసారం కానున్నాయి. మొత్తం 21 మంది యాంకర్లను స్టార్ ప్రకటించగా ఇందులో బుమ్రా భార్య సంజనా గణేషన్‌తో (Sanjana Ganeshan) పాటు స్టార్ యాంకర్లు కిరా నారాయణ, నెరోలి మిడోస్, జతిన్ సప్రూ వంటి వాళ్లు ఉన్నారు. ఇక తెలుగులో ముగ్గురు హోస్ట్స్ ఈ కార్యక్రమాన్ని అందించనున్నారు. టాలీవుడ్ హీరో నంద కృష్ణతో (Hero Nandu) పాటు వింధ్య విశాఖ (Vindhya Vishaka), నేహ చౌదరి (Neha Chowdary) యాంకర్లుగా వ్యవహరించనున్నారు.
Star Sports వింధ్య విశాఖ ఐపీఎల్ 2021 సీజన్లో స్టార్ స్పోర్ట్స్ యాంకర్‌గా వ్యవహరించనున్నారు. [PC: vindhya @ facebook]
తమిళ్ యాంకర్ భావన బాలక్రిష్ణన్ [Bhavana @ twitter]
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.