Home /News /sports /

STAR SPORTS INCREASE 10 SECONDS AD RATE BY 10 PERCENT 5 FAMOUS BRANDS DISCONTINUED ADS FOR IPL 2021 JNK

Star Sports: అమ్మో.. స్టార్ స్పోర్ట్స్‌లో 10 సెకెన్ల యాడ్‌కు రేటెంతో తెలుసా? రెండో ఫేస్ ఐపీఎల్‌కు పెరిగిన ధర

ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌కు యాడ్స్ రేట్లు భారీగా పెంచిన స్టార్ స్పోర్ట్స్

ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌కు యాడ్స్ రేట్లు భారీగా పెంచిన స్టార్ స్పోర్ట్స్

Star Sports: ఐపీఎల్ 2021 రెండో దశ మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్నది. స్టార్ స్పోర్ట్స్ తొలి దశ కంటే రెండో దశలో యాడ్స్ రేట్లను 10 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో కొన్ని బ్రాండ్లు యాడ్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  ఏదైనా బ్రాండ్, వస్తువు, ఉత్పత్తి గురించిన వివరాలు వినియోగదారుని దగ్గరకు త్వరగా చేరాలంటే మీడియా ఒక మంచి మార్గం. మౌత్ పబ్లిసిటీ ద్వారా చేరాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే టీవీ, ప్రింట్, వెబ్ మాధ్యమాలను ఉపయోగించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. టీవీల్లో యాడ్ ఇవ్వాలంటే సెకెన్ల చొప్పున లెక్క కడుతుంటారు. 10, 20, 30 సెకెన్ల చొప్పున లెక్కకట్టి సదరు బ్రాడ్‌కాస్టర్‌కు చెల్లించాల్సిందే. ఈ రేట్లు కూడా ప్రైమ్ టైమ్‌లో ఒక రేటు.. ప్రీమియర్ షోలు వేస్తే మరో రేటు వసూలు చేస్తుంటారు. ప్రేక్షకులు ఎక్కువగా చూసే సమయంలో రేట్లు కూడా భారీగా ఉంటాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాను స్టార్ స్పోర్ట్స్ (Star Sports)  కూడా అప్లై చేస్తున్నది. ఐపీఎల్ (IPL) హక్కులను బీసీసీఐ (BCCI) నుంచి భారీ రేటుకు దక్కించుకున్న స్టార్ గ్రూప్.. క్రికెట్ (Cricket) వంటి ప్రసారాల సమయంలో యాడ్ రేట్లు భారీగా పెంచేస్తున్నది. ఇండియాలో ఐపీఎల్‌కు చాలా ఆదరణ ఉంటుంది. ఇతర ద్వైపాక్షిక సిరీస్, ఐసీసీ (ICC) ఈవెంట్ల కంటే ఐపీఎల్ చూసే వాళ్ల సంఖ్య ఎక్కువ. అందుకే స్టార్ స్పోర్ట్స్‌లో యాడ్స్ ధరలు కూడా ఐపీఎల్ సమయంలో భారీగానే ఉంటాయి.

  ఐపీఎల్ 2021 తొలి దశలో స్టార్ స్పోర్ట్స్ 10 సెకెన్ల యాడ్‌కు రూ. 13 లక్షల నుంచి రూ. 13.5 లక్షల వరకు వసూలు చేసింది. ఎన్నో ప్రముఖ బ్రాండ్లు, ఎంఎన్‌సీ కంపెనీలు ఐపీఎల్ సమయంలో యాడ్స్ గుమ్మరించాయి. సీజన్ ప్రారంభానికి ముందే స్టార్ స్పోర్ట్స్ అనేక కంపెనీలతో యాడ్స్ ఒప్పందాలు కుదుర్చుకున్నది. టామ్ స్పోర్ట్స్ రిపోర్టు ప్రకారం 165కు పైగా బ్రాండ్లు, 90కి పైగా అడ్వర్టైజర్లు స్టార్‌కు యాడ్స్ ఇచ్చారు. డ్రీమ్ ఎలెవెన్, బైజూస్, ఫోన్‌పే సంస్థలు కో-ప్రెజెంటర్లుగా.. బింగో, కమ్లా పసంద్, ఏఎంఎఫ్ఐ, ఏసియస్ పెయింట్స్, అమెజాన్ ప్రైమ్, క్యాడ్‌బరీ డైరీ మిల్క్, థమ్స్‌అప్, గార్నియర్ మెన్, క్రెడ్ వంటి బ్రాండ్లు అసోసియేట్ స్పాన్సర్లుగా వ్యవహరించాయి. అయితే 29 మ్యాచ్‌ల అనంతరం కరోనా కారణంగా ఐపీఎల్ 2021 వాయిదా పడింది. దీంతో ఆయా సంస్థలు మిగిలిన మ్యాచ్‌లకు సంబంధించిన బకాయిలు చెల్లించలేదు.

  ఐపీఎల్ 2021 రెండో దశను యూఏఈకి తరలించడం ద్వారా స్టార్ స్పోర్ట్స్‌కు భారీగానే ఖర్చు అవుతున్నది. బ్రాడ్‌కాస్ట్ సిబ్బంది కోసం యూఏఈలో అదనంగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. దీంతో సెకెండ్ ఫేజ్‌కు 10 శాతం మేర యాడ్స్ రేటు పెంచాలని స్టార్ స్పోర్ట్స్ నిర్ణయించింది. రెండో దశలో యాడ్స్ ఇవ్వాలనుకుంటే 10 సెకెన్లకు రూ. 15 లక్షల నుంచి రూ. 15.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పింది. గతంలో కంటే ఇది రూ. 2 లక్షలు అదనం. కోవిడ్ సమయంలో ధరలు పెంచడం సబబు కాదని పలువురు స్పాన్సర్లు సూచించినా.. స్టార్ గ్రూప్ మాత్రం ధరలు పెంచడానికే నిర్ణయించినట్లు సమాచారం.

  Paralympics 2020: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. బ్యాడ్మింటన్‌లో దుమ్మురేపిన కృష్ణ నగార్   దీంతో కొన్ని ప్రముఖ బ్రాండ్లు రెండో దశలో యాడ్స్ ఇవ్వబోమని చెప్పాయని తెలుస్తున్నది. జస్ట్ డయల్, ఫ్రూటీ, వోడాఫోన్-ఐడియా, గ్రో, హావెల్స్ ఫ్యాన్స్ యాడ్స్ ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం. ప్రముఖ బ్రాండ్లు తప్పుకోవడంతో వారి స్థానంలో వేరే వారిని వెతికే పనిలో స్టార్ గ్రూప్ ఉన్నది. ఇప్పటికే 85 శాతం యాడ్ బుకింగ్స్ పూర్తయ్యాయని.. మరి కొంత మందిని వెతికే పనిలో మార్కెటింగ్ విభాగం ఉన్నట్లు స్టార్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా ఐపీఎల్ 2021 ద్వారా కనీసం రూ. 5వేల కోట్లు అర్జించాలని స్టార్ టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.

  US Open: యూఎస్ ఓపెన్ నుంచి ఆష్ బార్టీ అవుట్.. వరల్డ్ నెంబర్ 1కు షాకిచ్చిన అన్‌సీడెడ్ షెల్బీ రోజర్స్  Published by:John Naveen Kora
  First published:

  Tags: Bcci, IPL, IPL 2021, Star sports

  తదుపరి వార్తలు