Home /News /sports /

Olympics : సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలు గల్లంతు.. అర్హత ప్రక్రియ ముగిసినట్లు ప్రకటన

Olympics : సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలు గల్లంతు.. అర్హత ప్రక్రియ ముగిసినట్లు ప్రకటన

టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించని సైనా, శ్రీకాంత్

టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించని సైనా, శ్రీకాంత్

టోక్యో ఒలింపిక్స్‌ కోసం సన్నద్దం అవుతున్న స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్‌లకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. కరోనా కారణంగా చివరి అర్హత పోటీ సింగపూర్ ఓపెన్ కూడా రద్దవడంతో వారి ఒలింపిక్స్ ఆశలకు తెరపడింది.

ఇంకా చదవండి ...
    లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ (Saina Nehwal), పురుషుల అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్‌ల (Kidambi Srikanth) ఒలింపిక్స్ ఆశలకు తెరపడింది. కరోనా మహమ్మారి కారణంగా ఒలింపిక్స్ అర్హత పోటీల్లో చివరిదైన సింగపూర్ ఓపెన్ (Singapore Open) కూడా రద్దు కావడంతో వీరిద్దరూ టోక్యోలో అడుపెట్టే అవకాశం లేకుండా పోయింది. ఇకపై ఒలింపిక్స్ కోసం అర్హత పోటీలు నిర్వహించేది లేదని.. ప్రస్తుతం ఉన్న ర్యాంకుల్లో కూడా ఎలాంటి మార్పులు చేయబోమని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) (BWF) శుక్రవారం ప్రకటించింది. దీంతో వీరిద్దరూ ఒలింపిక్స్‌పై (Olympics) పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. కరోనా కారణంగా ఇండియా ఓపెన్, మలేషియా ఓపెన్, సింగపూర్ ఓపెన్ టోర్నమెంట్లు వరుసగా రద్దయ్యాయి. దీంతో గతంలో ఉన్న వీరి ర్యాంకు మెరుగుపరుచుకోవడానికి వీలు లేకుండా పోయింది. జూన్ 15 నాటికి బీడబ్ల్యూఎఫ్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 16లో ఉన్న వారికే ఒలింపిక్ బెర్త్ లభిస్తుంది. కాగా, కటాఫ్ తేదీకి ఇంకా 17 రోజులు ఉన్నా.. ఇకపై అర్హత పోటీలసు నిర్వహించేది లేదని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. ఇకపై ర్యాంకింగ్ జాబితాలో మార్పులు ఉండవని.. అర్హత పోటీలు లేనందున కొత్తగా పాయింట్లు సాధించే అవకాశం కూడా లేదు. అందుకే శుక్రవారంతో ర్యాంకింగ్ ప్రక్రియ నిలిపివేసినట్లు బీడబ్ల్యూఎఫ్ స్పష్టం చేసింది.

    కాగా, ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వారి జాబితాను ప్రకటించడానికి కొంత సమయం పడుతుందని.. ఆ లోగా ఆయా దేశాల జాతీయ ఒలింపిక్ కమిటీలు, సభ్యదేశాల నుంచి ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. అప్పుడు జాబితాలో ఏవైనా మార్పులు జరగి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇక అర్హత పోటీలు నిర్వహించే అవకాశం లేదు అని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. దీంతో సైనా, శ్రీకాంత్ ప్రతిష్టాత్మక పోటీలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇండియా నుంచి మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్, పురుషఉల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

    IPL 2021: ఐపీఎల్‌కు పెద్ద ఎదురు దెబ్బ.. ఆ క్రికెట్ ప్లేయర్లు కూడా రారంటా.. లీగ్ సక్రమంగా జరిగేనా?

    టోక్యో ఒలింపిక్స్ అర్హత కోల్పోవడంపై స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ స్పదించారు. ఒలింపిక్స్ అర్హత ప్రక్రియ ముగిసి తాను అర్హత సాధించకపోవడం చాలా నిరాశ కలిగించిందని శ్రీకాంత్ చెప్పాడు. 'ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా 5 కంటే ఎక్కువ అర్హత టోర్నీలు రద్దయ్యాయి. దాని ప్రభావం చాలా మందిపై పడింది. నాకు ఒలింపిక్స్ అర్హత కోసం మరో 6 వేల పాయింట్లు అవసరం ఉన్నాయి. ఆ ఆరు టోర్నీల్లో సాధారణ ప్రదర్శన చేసినా ఆ పాయింట్లను సాధించే వాడిని. ఆటగాడి చేతుల్లో ఏమీ లేనప్పుడు ఇలా అర్హతను నిర్ణయించడం సరికాదు. దీనిపై బీడబ్ల్యూఎఫ్ ఆలోచించాలి. తప్పకుండా క్రీడాకారులకు నష్టం లేని విధంగా నిబంధనలు రూపొందించాలి. సింగపూర్ ఓపెన్ కోసం చాలా సాధన చేశాను. కానీ ఇప్పుడ చివరి అర్హత పోటీ కూడా రద్దు కావడం బాధగా ఉన్నది' అని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Badminton, Olympics, Saina Nehwal, Tokyo Olympics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు