sania mirza: ఆమ్మో.. దాన్ని నేను తట్టుకోలేను.. ఎవరికీ కనిపించకుండా పోతాను..

sania mirza

భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా సోషల్ మీడియాలో విషపూరిత వాతావరణం నివారించేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు తను సోషల్‌మీడియా నుంచి మాయమైపోతానని ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్‌ చేసింది.

  • Share this:
    Sania Mirza:భారత స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ఇన్‌స్టా వేదికగా ఆసక్తికర పోస్ట్‌ చేసింది. టీ 20 ( T20 world cup) ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగే రోజున సానియా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా సోషల్ మీడియాలో విషపూరిత వాతావరణం నివారించేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు తను సోషల్‌మీడియా నుంచి మాయమైపోతానని ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్‌ చేసింది. ఆమె పాకిస్థాన్ ఆటగాడు షోయబ్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే షోయబ్ మాలిక్ పాకిస్థాన్ టీ 20 ప్రపంచకప్ పాక్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. షోయబ్ చాలా సంవత్సరాలుగా పాకిస్తాన్ తరుపున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు.










    View this post on Instagram






    A post shared by Sania Mirza (@mirzasaniar)






    వరల్డ్ కప్‌లో భారత్‌దే పైచేయి

    దాదాపు రెండేళ్ల తర్వాత ఈ రెండు జట్లు తలపడుతుండడంతో ఈ మ్యాచ్ కోసం అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. మాంచెస్టర్‌లో జరిగిన ప్రపంచకప్ సందర్భంగా 16 జూన్ 2019 న భారత్, పాకిస్తాన్ మధ్య చివరి మ్యాచ్ జరిగింది. ఇప్పుడు టీ 20 వరల్డ్ కప్‌లో భాగంగా అక్టోబర్ 24 న ఈ ఇద్దరు ప్రధాన ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ జరుగుతుంది.  పాకిస్థాన్ ఇప్పటి వరకు ఏ ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించలేకపోయింది. వన్డే వరల్డ్ కప్‌లో రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు జరిగాయి, ఇందులో భారత్ 7-0 ఆధిక్యంలో ఉంది. అలాగే టి 20 ప్రపంచ కప్‌లో ఇండియా, పాకిస్తాన్ మధ్య 5 మ్యాచ్‌లు జరిగాయి, ఇందులో టీమ్ ఇండియా 4-0తో ఆధిక్యంలో ఉంది. రెండు దేశాల మధ్య ఓ మ్యాచ్ టై అయింది. ఈ మ్యాచ్‌ని సూపర్ ఓవర్‌లో భారత్ గెలుచుకుంది. అంతేకాదు, 2007 సంవత్సరంలో, భారత జట్టు పైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి టీ 20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది.

    Happy Birthday Sania Mirza: టెన్నిస్ స్టార్ సానియా మిర్జా బ్యూటిఫుల్ ఫోటోస్..



    Sania Mirza: 8 లక్షల మంది విద్యార్థులకు ఫిట్‌నెస్ పాఠాలు చెప్పిన సానియా మీర్జా..

    Published by:Rekulapally Saichand
    First published: