• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • STAR OPENER TO MISS FIRST TOW MATCHES FOR SUNRISERS HYDERABAD JASON ROY IN ISOLATION JNK

IPL 2021 : తొలి మ్యాచ్‌కు ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ.. రెండు మ్యాచ్‌లకు స్టార్ బ్యాట్స్‌మాన్ దూరం

IPL 2021 : తొలి మ్యాచ్‌కు ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ.. రెండు మ్యాచ్‌లకు స్టార్ బ్యాట్స్‌మాన్ దూరం

సన్‌రైజర్స్ జట్టు ఇటీవల జట్టులోకి తీసుకున్న కీలక ఆటగాడు రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. [PC : SRH @ Twitter]

  • Last Updated:
  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఆదివారం (ఏప్రిల్ 11) తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (Kolkata Knight Riders) తలపడనున్నది. గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకొని రెండో ఎలిమినేటర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్ కోసం సన్‌రైజర్స్ జట్టు పూర్తిగా సన్నద్దమైంది. వేలంలో ఫామ్‌లో లేని కేదార్ జాదవ్‌ను కొనుగోలు చేసి తీవ్ర విమర్శలపాలయ్యింది. కాగా, మిచెల్ మార్ష్ ఈ సీజన్‌కు కూడా అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో చివరి నిమషంలో ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మాన్ జేసన్ రాయ్‌ని (Jason Roy) జట్టులోకి తీసుకున్నది. ఇండియాతో జరిగిన సిరీస్‌లో రాయ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతడు జట్టులో చేరడం వల్ల బ్యాటింగ్‌కు అదనపు బలం చేకూరింది. అయితే రాయ్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని యాజమాన్యం స్పష్టం చేసింది. ఇంగ్లాండ్ నుంచి రాయ్ శనివారం ఉదయమే చెన్నై చేరుకున్నాడు. బీసీసీఐ ప్రోటోకాల్ (BCCI) ప్రకారం 7 రోజుల పాటు కచ్చితంగా ఐసోలేషన్‌లో (Isolation) ఉండాలి. ప్రస్తుతం చెన్నైలోని ఒక హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉన్న రాయ్.. ఏడు రోజుల అనంతరం జట్టుతో చేరతాడు. దీంతో తొలి వారంలో జరిగే మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నాడు.

    బీసీసీఐ ప్రోటోకాల్స్ ప్రకారం ఇండియా-ఇంగ్లాండ్ వన్డే బయోబబుల్ నుంచి నేరుగా ఐపీఎల్ బయోబబుల్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఆయా ఆటగాళ్లకు ఎలాంటి ఐసోలేషన్ లేకుండానే నేరుగా జట్టుతో చేరడానికి అవకాశం ఇచ్చారు. అయితే జేసన్ రాయ్ వన్డే సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. అక్కడ ఉన్న సమయంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఒప్పందం కుదిరింది. దీంతో తిరిగి ఇండియా చేరుకున్నాడు. అయితే ఇంగ్లాండ్ నుంచి రావడంతో అతడికి ఐసోలేషన్ తప్పనిసరి అయ్యింది. ఏప్రిల్ 14న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌కు కూడా అతడు దూరమయ్యే అవకాశం ఉన్నది. దీంతో సన్ రైజర్స్ ఓపెనర్‌గా డేవిడ్ వార్నర్‌కు తోడు వృద్దిమాన్ సాహ లేదా జానీ బెయిర్‌స్టో దిగే అవకాశం ఉన్నది. ఓపెనింగ్ జోడీ కనుక విశేషంగా రాణిస్తే జేసన్ రాయ్ బెంచ్‌కే పరిమితం కావల్సి ఉంటుంది. మరోవైపు హైదరాబాద్‌ జట్ట బెంచ్‌పై విదేశీ ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఉన్న నాలుగు స్పాట్లతో సరైన కూర్పు చేయడం కెప్టెన్ వార్నర్‌కు కష్టమైన పనే.







    ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీలక బ్యాట్స్‌మాన్ అయిన జేసన్ రాయ్ ఇటీవల ఇండియాతో ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌లో విశేషంగా రాణించాడు. ఐదు టీ20ల్లో 28.80 సగటుతో, వన్డేల్లో 38.33 సగటుతో బ్యాటింగ్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ లయన్స్ తరపున రాయ్ ఐపీఎల్ ఆడాడు. మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన రాయ్ 29.83 సగటుతో 179 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అతడి స్ట్రైక్ రేట్ 133.58గా ఉన్నది.
    Published by:John Naveen Kora
    First published: