హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL commentary in regional languages : స్టార్ స్పోర్ట్స్ కాకుండా ఐపీఎల్ ఎక్కడ చూడవచ్చు.. లోకల్ భాషల్లో కామెంట్రీ

IPL commentary in regional languages : స్టార్ స్పోర్ట్స్ కాకుండా ఐపీఎల్ ఎక్కడ చూడవచ్చు.. లోకల్ భాషల్లో కామెంట్రీ

Star Sports : ఐపీఎల్ 2021 సీజన్‌ మ్యాచ్‌లను 25 ఛానల్స్‌లో ప్రసారం చేయడానికి స్టార్ గ్రూప్ ఏర్పాట్లు చేసింది.

Star Sports : ఐపీఎల్ 2021 సీజన్‌ మ్యాచ్‌లను 25 ఛానల్స్‌లో ప్రసారం చేయడానికి స్టార్ గ్రూప్ ఏర్పాట్లు చేసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 14వ సీజన్ కోసం బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియా (Star India) భారీ ఏర్పాట్లు చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఖాళీ స్టేడియంలో ఈ మెగా లీగ్ నిర్వహిస్తుండటంతో టీవీల్లో చూసే వారి సంఖ్య మరింతగా పెరగనున్నది. ఐపీఎల్ ప్రసార హక్కులు కలిగి ఉన్న స్టార్ గ్రూప్ ఇప్పటికే తమ సిబ్బందిని, కామెంటేటర్లను బయోబబుల్‌లోకి పంపించింది. తొలి విడత మ్యాచ్‌లు జరిగే ముంబై, చెన్నైలలో పూర్తి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాదితో ఐపీఎల్ ప్రసార హక్కులు ముగిసిపోతుండటంతో స్టార్ ఇండియా సాధ్యమైనంత ఎక్కువగా ఆదాయాన్ని పొందాలని ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తున్నది. గతంలో మ్యాచ్‌లు జరిగితే స్టార్ స్పోర్ట్స్ చానెల్‌లో మాత్రమే ప్రసారం చేసేవాళ్లు. కానీ ఈ సారి భారీగా 25 ఛానెల్స్‌లో క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం జరుగనున్నది. కేవలం హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే కాకుండా మరో ఆరు ప్రాంతీయ భాషల్లో వ్యాఖ్యానాన్ని అందించనున్నట్లు స్టార్ తెలిపింది. ఈ ఏడాది స్టార్ ఇండియాకు చెందిన డిస్నీ కిడ్స్ ఛానెల్‌లో కూడా ఐపీఎల్ ప్రసారం కానున్నది.

స్టార్ ఇండియా నెట్‌వర్క్‌లో హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ, మళయాలం, బెంగాళీ, మరాఠి భాషల్లో వ్యాఖ్యానాన్ని ప్రసారం చేస్తారు. ఇప్పటికే ముంబై ప్రధాన కార్యాలయంలో ఆయా భాషలకు సంబంధించిన విభాగాలను సిద్దంగా ఉంచారు. కామెంటేటర్లు రిమోట్ ప్లేస్‌ల నుంచి వ్యాఖ్యానం అందించే ఏర్పాట్లు చేశారు.


ఏ ఛానల్‌లో ఏ భాషలో ప్రసారాలు?

హిందీ : స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ హెచ్‌డీ, ఎస్డీతో పాటు స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్

ఇంగ్లీష్ : స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ మరియు ఎస్డీ, స్టార్ స్పోర్ట్స్ 2 హెచ్‌డీ మరియు ఎస్డీ, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2 హెచ్‌డీ

తమిళ్ : స్టార్ స్పోర్ట్స్ తమిళ్ (అన్ని రోజులు), విజయ్ సూపర్ ఎస్డీ (ఆదివారాలు మాత్రమే)

తెలుగు : స్టార్ స్పోర్ట్స్ తెలుగు (అన్ని రోజులు), స్టార్ మా మూవీస్ హెచ్‌డీ మరియు ఎస్డీ (ఆదివారాలు మాత్రమే)

కన్నడ : స్టార్ స్పోర్ట్స్ కన్నడ (అన్ని రోజులు), స్టార్ సువర్ణ హెచ్‌డీ మరియు ఎస్డీ (ఆదివారాలు మాత్రమే)

బెంగాళీ : స్టార్ స్పోర్ట్స్ బంగ్లా (అన్ని రోజులు), స్టార్ జల్షా మూవీస్ హెచ్‌డీ మరియు ఎస్డీ (ఆదివారాలు మాత్రమే)

మరాఠి : స్టార్ ప్రవాహ్ హెచ్‌డీ మరియు ఎస్డీ (ఆదివారాలు)

మళయాలం : ఏసియానెట్ ప్లస్ ఎస్డీ (ఆదివారాలు)

ఈ చానల్స్‌తో పాటు డిస్నీ+హాట్‌స్టార్‌లో ఐదు భాషల్లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. జియో అకౌంట్ ఉన్న వాళ్లు జియో క్రికెట్ టీవీలో కూడా ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించే అవకాశం ఉంటుంది.

First published:

Tags: Bcci, Disney+ Hotstar, IPL 2021, Star Maa, Star sports

ఉత్తమ కథలు