Video : ICC వరల్డ్ కప్ 2019 సాంగ్ 'స్టాండ్ బై' మీరు చూశారా...

ICC World Cup 2019 : క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్ జరిగిన ప్రతిసారీ ప్రత్యేక సాంగ్ రూపొందిస్తున్నారు. ఈసారి కూడా కూల్ మోడ్‌లో పిక్చరైజ్ చేసిన సాంగ్ రిలీజైంది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 18, 2019, 8:05 AM IST
Video : ICC వరల్డ్ కప్ 2019 సాంగ్ 'స్టాండ్ బై' మీరు చూశారా...
ప్రపంచకప్ స్టాండ్ బై సాంగ్ (Image : Youtube)
  • Share this:
IPL ముగిసింది. నాల్రోజుల్లో ఎన్నికల హడావుడి ముగుస్తింది. ఆ తర్వాతేముంది... ఇక అంతా ICC వరల్డ్ కప్ సందడే. ఇప్పటికే ఏర్పాట్లలో బిజీ అయిన ఆతిథ్య దేశం ఇంగ్లండ్... తాజాగా వరల్డ్ కప్ అఫీషియల్ సాంగ్‌ను ICCతో కలిసి రిలీజ్ చేసింది. ఈ పాటను న్యూ ఆర్టిస్ట్ లోరిన్ పాడగా... బ్రిటన్‌కి చెందిన అత్యంత ప్రజాదరణ ఉన్న నలుగురు సభ్యుల రుడిమెంటల్ బ్యాండ్ టీం మ్యూజిక్ ఇచ్చింది. ప్రతి ఆటగాళ్ల జట్టుపై ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకునేలా ఈ సాంగ్‌ను రూపొందించారు. యూట్యూబ్‌లో రిలీజైన ఈ సాంగ్‌కి ఒకప్పటి సాకర్ సాంగ్ వాకా వాకా అంత క్రేజ్ రాకపోయినా... ప్రస్తుతానికి బాగానే షేరవుతోంది. రిలైజైన 15 గంటల్లో లక్షా 40 వేల మందికిపైగా చూశారు.



ఈ సాంగ్‌ను మ్యాచ్‌లు జరిగే స్టేడియంలలో, బ్రిటన్‌లో జరిగే ఈవెంట్లలో వినిపిస్తారు, పాడతారు. మే 30న ఐసీసీ ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కాబోతోంది.

ఈసారి ఇండియా కచ్చితంగా కప్ గెలుస్తుందనే అంచనాలున్నాయి. ఫామ్‌లో ఉన్న ఆల్ రౌండర్లు, బలమైన టాప్ ఆర్డర్‌తోపాటూ... స్పిన్నర్లు, పేసర్లతో బౌలింగ్ కూడా పటిష్టంగా ఉండటం వల్ల టీంఇండియా గెలుపుపై అంచనాలు పెరిగాయి.

 

ఇవి కూడా చదవండి :

ఎవరు గెలుస్తారు..? కోట్లు సంపాదిస్తున్న జ్యోతిష్యులు...లగడపాటి సర్వే సిద్ధం... ఎగ్జిట్‌ పోల్స్ ఏం చెప్పినా...

రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్... కరెక్టే చెబుతాయా..?

రూ.10 నాణేనికి ఓ దండం... వద్దంటున్న ప్రజలు...

First published: May 18, 2019, 8:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading