హోమ్ /వార్తలు /క్రీడలు /

Cricket : ఆల్‌రౌండర్‌కి షాక్.. ఏడాది పాటూ నిషేధం

Cricket : ఆల్‌రౌండర్‌కి షాక్.. ఏడాది పాటూ నిషేధం

చమిక కరుణరత్నే (image credit - AFP)

చమిక కరుణరత్నే (image credit - AFP)

Cricket : క్రికెటర్లు అప్పుడప్పుడూ చేసే తప్పులు వారి కెరీర్‌ని దెబ్బతిస్తాయి. అలా ఓ ఆల్‌రౌండర్.. కెరీర్‌కి ఏడాది బ్రేక్ పడింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  Cricket : క్రికెట్‌లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. బోర్డులు సడెన్‌గా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. అలా తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు.. షాకింగ్ నిర్ణయం తీసుకుంది. శ్రీలంక ఆల్‌రౌండర్ అయిన చమిక కరుణరత్నేపై ఏడాది పాటూ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ.. అతను చేసిన ఓ తప్పిదం ఇందుకు కారణం అయ్యింది. చమిక.. ఈమధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో.. బోర్డుకి సంబంధించిన అగ్రిమెంట్లను కాలరాశాడు. దీనిపై ఓ కమిటీని వేసింది బోర్డు. కమిటీ సభ్యులు అతన్ని ప్రశ్నించగా.. తాను నియమాలను ఉల్లంఘించినట్లు తెలిపాడు. దాంతో.. అతనిపై సంవత్సరంపాటూ నిషేధం విధించడమే కాదు.. రూ.4 లక్షలకు పైగా ఫైన్ కూడా వేసింది.

  ఆస్ట్రేలియాలో ICC టీ-ట్వంటీ ప్రపంచకప్ జరిగినప్పుడు ఈ తప్పిదాలకు పాల్పడ్డాడు చమిక. క్రికెట్‌లో ఓ నెలపాటూ ఆడకపోతేనే ఫామ్ కోల్పోతుంటారు. అలాంటిది ఏకంగా ఏడాది పాటూ సస్పెండ్ అయితే.. ఫామ్ పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అసలే శ్రీలంక జట్టుకు అల్‌రౌండర్ల కొరత ఉంది. ఇలాంటి సమయంలో ముగ్గురు సభ్యుల కమిటీ.. క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో.. చమిక కెరీర్‌కి బ్రేక్ పడినట్లైంది. ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో.. చమిక కరుణరత్నే.. ఓ క్యాసినో కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిసింది. ఇలాంటి తప్పిదాలే అతనికి సస్పెండ్ ఆర్డర్ తెచ్చినట్లైంది.

  Published by:Kumar Krishna
  First published:

  Tags: Cricket, Srilanka

  ఉత్తమ కథలు