సంగక్కరపై 10 గంటల పాటు ప్రశ్నలు.. 2011 ప్రపంచకప్ ఫిక్సింగ్ పై విచారణ

శుక్రవారం మహేల జయవర్ధనె కూడా విచారణకు హాజరయ్యారు. ఆయన్ను కూడా ప్రశ్నించి స్టేట్‌మెట్ రికార్డు చేశారు.

news18-telugu
Updated: July 3, 2020, 8:53 PM IST
సంగక్కరపై 10 గంటల పాటు ప్రశ్నలు.. 2011 ప్రపంచకప్ ఫిక్సింగ్ పై విచారణ
కుమార సంగక్కర
  • Share this:
2011 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్ జరిగిందని..భారత్‌కు లంక జట్టు అమ్ముడుపోయిందన్న ఆరోపణలు శ్రీలంకలో దుమారం రేపుతున్నాయి. సాక్షాత్తు శ్రీలంక మాజీ క్రీడల శాఖ మంత్రి, మాజీ కెప్టెనే ఈ ఆరోపణలు చేయడంతో క్రీడాశాఖ విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలంక దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ కుమార సంగక్కరను గురువారం విచారించారు. దాదాపు 10 గంటల పాటు ఆయనసై ప్రశ్నలు గుప్పించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.

ఐతే విచారణ తర్వాత కుమార సంగక్కర ఎక్కడికి వెళ్లారన్ననది తెలియడం లేదు. ప్రస్తుతం లంకలో దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. శుక్రవారం మహేల జయవర్ధనె కూడా విచారణకు హాజరయ్యారు. ఆయన్ను కూడా ప్రశ్నించి స్టేట్‌మెట్ రికార్డు చేశారు.

'2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు గెలవాల్సి ఉంది. కానీ భారత్‌కు అమ్ముడుపోయాం. నేను క్రీడల మంత్రిగా ఉన్నా. ఈ విషయం అప్పుడే నాకు తెలుసు. కానీ బయటపెట్టదలచుకోలేదు. క్రీడాకారులను ఇందులోకి లాగడం లేదు. కానీ కొన్ని వర్గాల హస్తముంది.' అని ఇటీవల శ్రీలంక మాజీ క్రీడల మంత్రి, ప్రస్తుత విద్యుత్ మంత్రి మహిందనంద అలుత్గమగే సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో అర్జున రణతుంగే సైతం ఇలాంటి ఆరోపణలే చేశారు. ఆ మ్యాచ్‌లో కామెంట్రేటర్‌గా ఉన్న ఆయన.. ఫైనల్ మ్యాచ్‌పై విచారణ జరగాలని 2017లో డిమాండ్ చేశారు. అర్జున రణతుంగే 1996లో వరల్డ్ కప్ గెలిచిన లంక జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు.

కాగా, 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా, శ్రీలంక మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 18 పరుగులకే ఔటయ్యారు. గంభీర్ 97, ధోనీ 91 పరుగులతో రాణించడంతో టీమిండియా గెలిచి.. ప్రపంచ కప్‌ను ముద్దాడింది. బలహీనమైన బౌలింగ్, చెత్త ఫీల్డింగ్ వల్లే భారత్ గెలించిందని నాటి లంక కెప్టెన్ సంగరక్కపై తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు లంక క్రికెట్ అభిమానులు.
Published by: Shiva Kumar Addula
First published: July 3, 2020, 8:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading