హోమ్ /వార్తలు /sports /

Sri Lanka: ఇంగ్లండ్ ను నాశనం చేసిన కోచ్ తో మీరేం చేస్తార్రా బాబు..! శ్రీలంకపై ఫ్యాన్స్ ఫైర్

Sri Lanka: ఇంగ్లండ్ ను నాశనం చేసిన కోచ్ తో మీరేం చేస్తార్రా బాబు..! శ్రీలంకపై ఫ్యాన్స్ ఫైర్

Sri Lanka Cricket Team: 2014లో జరిగిన టి20 ప్రపంచకప్ (World Cup)లో విజేతగ... 1996లో వన్డే ప్రపంచకప్ విజేత... 2007, 2011 వన్డే ప్రపంచకప్ లలో రన్నరప్ గా నిలిచిన ఘనత.. ఇప్పటికే మీకు ఏ జట్టు గురించి చెప్పబోతున్నానో ఓ ఐడియా వచ్చేసే ఉంటుంది.

ఇంకా చదవండి ...

    Sri Lanka Cricket Team: 2014లో జరిగిన టి20 ప్రపంచకప్ (World Cup)లో విజేతగ... 1996లో వన్డే ప్రపంచకప్ విజేత... 2007, 2011 వన్డే ప్రపంచకప్ లలో రన్నరప్ గా నిలిచిన ఘనత.. ఇప్పటికే మీకు ఏ జట్టు గురించి చెప్పబోతున్నానో ఓ ఐడియా వచ్చేసే ఉంటుంది. అవును.. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శ్రీలంక (Sri Lanka) క్రికెట్ జట్టు గురించి. 1996 నుంచి 2014 వరకు కూడా ఆ జట్టు మేటి జట్లలో ఒకటిగా ఉండేది. అప్పటి రణతుంగ నుంచి మొన్నటి మ్యాథ్యూస్, మలింగల వరకు ఎంతో నైపుణ్యం ఉన్న క్రికెటర్లు శ్రీలంక జట్టు ద్వారా ప్రపంచానికి పరిచయం అయ్యారు. అవ్వడమే కాదు... తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే అప్పటి శ్రీలంక జట్టుకు ఇప్పటి శ్రీలంక జట్టుకు చాలా తేడా కనిపిస్తోంది.

    సనత్ జయసూర్య, ఆటపట్టు, సంగక్కార, దిల్షాన్, జయవర్దనే, చమింద వాస్, మలింగ, మురళీధరన్ లాంటి టాప్ ప్లేయర్లతో అప్పటి టాప్ టీం ఆస్ట్రేలియా లాంటి జట్టును సైతం వారి దేశంలో వణికించిన ఘనత శ్రీలంకకు సొంతం. అయితే కాలం మారింది... టాప్ ఆటగాళ్లు రిటైర్ అవ్వడం... బోర్డుతో గొడవలు వంటి కారణాలతో ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టు పేలవంగా తయారైంది. బంగ్లాదేశ్ లాంటి జట్టు చేతిలో కూడా ఓడిపోయే టీంలా తయారైంది. తాజాగా శ్రీలంక జట్టు కొత్త కోచ్ ను ఎంచుకుంది. మికీ ఆర్థర్ వెళ్లిపోవడంతో.. ఇంగ్లండ్ కు చెందిన సిల్వర్ వుడ్ ను తమ కోచ్ గా ఎంపిక చేసింది. రెండేళ్ల కాలానికి సిల్వర్ వుడ్ ను కోచ్ గా నియమిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే అతడి ఎంపికపై శ్రీలంక క్రికెట్ ఫ్యాన్స్ కోపంతో ఉన్నారు. 2019 ప్రపంచకప్ నెగ్గిన ఇంగ్లండ్ జట్టును నాశనం చేసిన సిల్వర్ వుడ్ ను కెప్టెన్ గా ఎంచుకోవడం ఏంటంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

    ఇంగ్లండ్ కు చెందిన సిల్వర్ వుడ్ 2019లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నాడు. అంతకుముందు 2019 ప్రపంచకప్ నెగ్గిన ఇంగ్లండ్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా పనిచేశాడు. అయితే హెడ్ కోచ్ గా మారిన తర్వాత ఇంగ్లండ్ ఆటతీరు దారుణంగా దెబ్బతింది.  సిల్వర్‌వుడ్‌ హెడ్ కోచ్ గా ఇంగ్లండ్‌.. యాషెస్ 2021-22లో ఆసీస్‌ చేతిలో 4-0 దారుణ పరాభవాన్ని ఎదుర్కొనడంతో పాటు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో కూడా ఖంగుతింది. అత్యుత్తమ ఆటగాళ్లతో ప్రపంచ నంబర్‌ వన్‌ జట్టుగా కొనసాగిన ఇంగ్లండ్‌.. సిల్వర్‌వుడ్‌ హాయాంలో పసికూనల చేతిలో కూడా ఓటమిపాలైంది. ఇంతటి బ్యాడ్‌ ట్రాక్‌ రికార్డు కలిగిన సిల్వర్‌వుడ్‌ను తాజాగా శ్రీలంక తమ హెడ్‌ కోచ్‌గా నియమించుకుంది.

    First published:

    ఉత్తమ కథలు