హోమ్ /వార్తలు /క్రీడలు /

Cricket : కరోనా రూల్స్ బ్రేక్ చేసినందుకు శ్రీలంక ముగ్గురు క్రికెటర్లపై ఏడాది పాటు నిషేధం...

Cricket : కరోనా రూల్స్ బ్రేక్ చేసినందుకు శ్రీలంక ముగ్గురు క్రికెటర్లపై ఏడాది పాటు నిషేధం...

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Cricket : కరోనా బయోబబుల్ రూల్స్ ఉల్లంఘించినందుకు ముగ్గురు శ్రీలంక క్రికెటర్లపై నిషేధం పడింది. ఏడాది పాటు నిషేధం విధించిన శ్రీలంక క్రికెట్ బోర్డు అదనంగా 10 మిలియన్ శ్రీలంక రూపాయల జరిమానాను విధించింది.

కరోనా బయోబబుల్ రూల్స్ ఉల్లంఘించినందుకు ముగ్గురు శ్రీలంక క్రికెటర్లపై నిషేధం పడింది. గత నెలలో ఇంగ్లండ్ టూర్ లో రూల్స్ బ్రేక్ చేసినందుకు ఈ నిషేధం విధించినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ధనుష్క గుణతిలక, కుశాల్ మెండీస్, నిరోషన్ డిక్వెల్లా లపై శ్రీలంక బోర్డు బ్యాన్ విధించింది. వీరు ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్, ఆరు నెలల పాటు జాతీయ క్రికెట్ ఆడేందుకు వీల్లేందని ఆదేశించింది. దీంతో పాటు, 10 మిలియన్ శ్రీలంక రూపాయల ఫైన్ వేశారు. ఇంగ్లండ్ టూర్ లో టీ-20 సిరీస్ ముగిసిన తర్వాత..ఆ జట్టు ఆటగాళ్లు కుశాల్ మెండిస్, నిరోషాన్ డిక్వెల్లా, దనుష్ గుణతిలక టీమ్ బస చేసిన హోటల్‌ని వీడటం ద్వారా బయో- సెక్యూర్ బబుల్‌ని బ్రేక్ చేశారు. అక్కడే డర్హామ్‌లోని ఓ స్ట్రీట్‌లోకి వెళ్లిన మెండిస్, డిక్వెల్లా సిగరెట్ తాగుతూ శ్రీలంక అభిమాని కంటపడ్డారు. దీంతో.. సదరు అభిమాని తన మొబైల్‌తో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో శ్రీలంక క్రికెటర్లపై విమర్శలు వెల్లువెత్తాయ్.

దీంతో, శ్రీలంక క్రికెటర్లు ముగ్గురూ నిబంధనల్ని అతిక్రమించినట్లు తేలడంతో.. వారిపై శ్రీలంక బోర్డు చర్యలు తీసుకుంది. రూల్స్‌ని బ్రేక్ చేసినట్లు విచారణలో తేలడంతో శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కుశాల్ మెండిస్, దనుష్ గుణతిలక, నిరోషాన్ డిక్వెల్లాను సస్పెండ్ చేసింది. వారిని వెంటనే శ్రీలంకకి వచ్చేయాల్సిందిగా ఆదేశించింది. ఇప్పటి పూర్తి విచారణ చేపట్టిన తర్వాత ఒక ఏడాది పాటు బ్యాన్ విధించింది.


ఇక, ఈ ముగ్గురు క్రికెటర్లు.. లేటెస్ట్ గా జరిగిన టీమిండియా సిరీస్ లో కూడా ఆడలేదు. వీరి బదులు అవకాశాలు అందిపుచ్చుకున్న యంగ్ క్రికెటర్లు చెలరేగడంతో.. వీరి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.

First published:

Tags: Corona effect, Cricket, Sports, Sri Lanka

ఉత్తమ కథలు