Lasith Malinga: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఫాస్ట్ బౌలర్ మలింగా.. అతడి రికార్డులు ఇవే..

లసిత్ మలింగా (ఫైల్ ఫోటో)

Lasith Malinga: ఈ ఏడాది మొదట్లోనే మలింగా ముంబై ఇండియన్స్‌కు తన రిటైర్మెంట్‌పై సమాచారం ఇచ్చారు. తాను ఇకపై జట్టుకు అందుబాటులో ఉండబోనని తెలిపారు.

 • Share this:
  శ్రీలంక స్టార్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. 17 ఏళ్ల పాటు క్రికెట్‌ను ఆస్వాదించిన తాను ఇకపై ఫీల్డ్‌లో కొనసాగాల్సిన అవసరం లేదన్న మలింగా.. తాను టీ20 క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. గతంలోనే టెస్ట్, వన్డే ఫార్మట్ల నుంచి వైదొలిగిన మలింగా.. తాజాగా టీ20 ఫార్మాట్ నుంచి కూడా వైదొలిగి.. మొత్తంగా క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. తన యూట్యూబ్ ఛానల్‌లో వీడియో పోస్ట్ చేసిన మలింగా ఈ మేరకు ప్రకటించారు. క్రికెట్ అంటే ఇష్టపడే యువత కోసం తన ప్రోత్సాహం కొనసాగుతుందని మలింగా అన్నారు. క్రికెట్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరి కోసం తాను అందుబాటులో ఉంటానని అన్నారు. తనకు క్రికెట్ ఆడే అవకాశం ఇచ్చిన శ్రీలంక క్రికెట్ బోర్డుతో పాటు ఐపీఎల్‌లోని ముంబై ఇండియన్స్‌కు ఈ సందర్భంగా లసిత్ మలింగా కృతజ్ఞతలు తెలిపారు.

  ఈ ఏడాది మొదట్లోనే మలింగా ముంబై ఇండియన్స్‌కు తన రిటైర్మెంట్‌పై సమాచారం ఇచ్చారు. తాను ఇకపై జట్టుకు అందుబాటులో ఉండబోనని తెలిపారు. విండీస్‌తో మార్చి 2020లో జరిగిన టీ20 మ్యాచ్ మలింగాకు చివరి టీ20 మ్యాచ్. మలింగా తన క్రికెట్ చరిత్రలో అనేక రికార్డులు సృష్టించారు. ఐపీఎల్‌లో 166 వికెట్లు తీసిన అమిత్ మిశ్రా తరువాతి స్థానంలో మలింగా ఉన్నారు. అమిత్ మిశ్రాకు కేవలం నాలుగు వికెట్ల దూరంలో ఉన్నారు.  అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదుసార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన రికార్డ్ కూడా మలింగా సొంతం. వరుసగా నాలుగు బంతులకు నాలుగు వికెట్లను రెండుసార్లు తీసిన రికార్డ్ కూడా మలింగా సొంతం. అంతర్జాతీయ క్రికెట్‌లో 30 టెస్టులు ఆడిన మలింగా 101 వికెట్లు తీశారు. 226 వన్డేలు ఆడిన ఈ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ 338 వికెట్లు పడగొట్టాడు.

  Sleep: గాఢంగా నిద్రపోవాలనుకుంటున్నారా ?.. ఇలా చేస్తే మీ నిద్రకు ఇబ్బంది ఉండదు..

  Revanth Reddy: రేవంత్ రెడ్డి సీక్రెట్ సర్వే.. ఆ రిపోర్ట్ ఆధారంగా కీలక నిర్ణయాలు

  83 టీ20 మ్యాచ్‌లు ఆడిన మలింగా 107 వికెట్లు తీశాడు. 2004లో టెస్ట్ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన మలింగా.. 2010లోనే ఐదు రోజుల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2004లో వన్డే క్రికెట్ మొదలుపెట్టిన మలింగా.. 2019లో వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.
  Published by:Kishore Akkaladevi
  First published: