• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • SRI LANKAN BATSMAN KUSAL MENDIS ARRESTED BY LOCAL POLICE

వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ అరెస్ట్

వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ అరెస్ట్

ప్రతీకాత్మక చిత్రం

  • Last Updated:
  • Share this:
    శ్రీలంక బ్యాట్స్‌మన్ కుశాషల్ మెండిస్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. కొలంబో శివారులో అతని కారు అదుపుతప్పి ఓ వ‌ృద్దుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయాడు. దీంతో పోలీసులు కుశాషపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో మితిమిరిన వేగంతో అతను కారు నడిపినట్లు స్ధానికులు పోలీసులు తెలిపారు.

    అరెస్ట్ అనంతరం కుశాల్‌ను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. శ్రీలంక జాతీయ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్న మెండిస్ ఇప్పటి వరకూ 44 టెస్ట్‌లు,76 వన్డ్‌లు ఆడాడు. కరోనా కారణంగా ఎలాంటి టూర్‌లు లేకపోవడంతో క్రికెటర్లు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఆ దేశంలో లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో లాంగ్ డ్రైవ్ కోసం బయటకు వెళ్ళిన కుషల్ ఈ ప్రమాదానికి కారణమయ్యాడు,

    ప్రస్తుతం శ్రీలంక జట్టు ఫిక్సింగ్ అరోపణలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కుషల్ అరెస్ట్ ఆదేశ క్రికెట్ బోర్డును మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్‌ జరిగిదంటూ వచ్చిన వార్తలపై శ్రీలంక ప్రభుత్వం ఇటీవల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని ఏర్పాటు చేపింది. సీట్ విచారణ జరుగుతున్న సమయంలోనే కుషల్ అరెస్ట్ జరగడంతో వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్‌కు అతని లింక్ ఉందని అందరూ అనుకున్నారు.
    Published by:Rekulapally Saichand
    First published: