Sri Lanka vs India 3rd ODI: మూడో వన్డేలో టీమిండియాను ఓడించిన శ్రీలంక.. 39 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్..

మ్యాచ్‌లోని దృశ్యం

ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన టీమిండియా, శ్రీలంక మూడో వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య లంక టీం మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 226 పరుగుల లక్ష్యాన్ని లంక ఆటగాళ్లు ఫెర్నాండో 76 పరుగులు, రాజపక్స 65 పరుగులతో రాణించడంతో లంక జట్టు 39 ఓవర్లలోనే లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.

  • Share this:
    కొలంబో: ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న టీమిండియా, శ్రీలంక మూడో వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య లంక టీం మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో లంకకు గెలుపు వరించింది. టీమిండియా నిర్దేశించిన 226 పరుగుల లక్ష్యాన్ని లంక ఆటగాళ్లు ఫెర్నాండో 76 పరుగులు, రాజపక్స 65 పరుగులతో రాణించడంతో లంక జట్టు 39 ఓవర్లలోనే లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. రెండు వన్డేల్లో సత్తా చాటి సిరీస్‌ను కైవసం చేసుకుని.. క్లీన్ స్వీప్‌పై కన్నేసిన టీమిండియా మూడో వన్డేలో మాత్రం ఆ స్థాయి ఆటతీరును కనబర్చలేకపోయింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా జట్టుకు మధ్యలో వర్షం అడ్డు తగిలింది. దీంతో.. మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. ఓపెనర్ పృథ్వీషా 49 బంతుల్లో 49 పరుగులు చేసి షనక బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టగా.. మరో ఓపెనర్ ధావన్ కూడా ఛమీరా బౌలింగ్‌లో క్యాచ్‌‌గా చిక్కి 13 పరుగులకే ఔటయ్యాడు.

    సంజూ శాంసన్ 46 పరుగులు చేసి జయవిక్రమ బౌలింగ్‌లో క్యాచ్‌గా వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ 40 పరుగులు, హార్థిక పాండ్యా 19 పరుగులు, రాహుల్ చాహర్ 13, నవదీప్ సైనీ 15 పరుగులు చేసి ఔట్ కావడంతో టీమిండియా జట్టు 43.1 ఓవర్లకు 225 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం.. లక్ష్య చేధనకు బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు టీమిండియా బౌలర్ క్రిష్ణప్ప గౌతమ్ ఆదిలోనే షాకిచ్చాడు. లంక ఓపెనర్ మినోద్ భనుకు 7 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. అయితే.. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన భనుక రాజపక్స, మరో ఓపెనర్ ఫెర్నాండో కలిసి లంక జట్టుకు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. ఫెర్నాండో 76 పరుగులు చేసి రాహుల్ చాహర్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. రాజపక్స 65 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద చేతన్ సకారియా బౌలింగ్‌లో క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. అసలంక 24 పరుగులు చేసి హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ బాట పట్టాడు. చివర్లో రమేష్ మెండిస్, ధనంజయ కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చారు.

    టీమిండియా బౌలర్లలో రాహుల్ చాహర్‌కు మూడు వికెట్లతో రాణించగా.. సకారియా రెండు వికెట్లు, క్రిష్ణప్ప గౌతమ్, హార్థిక్ పాండ్యాకు చెరో వికెట్ దక్కింది. శ్రీలంక బౌలర్లలో ధనంజయ, జయవిక్రమ చెరో మూడు వికెట్లతో రాణించారు. ఛమీరాకు రెండు వికెట్లు, కరుణరత్నే, షనకకు చెరో వికెట్ దక్కింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా బ్యాటింగ్‌లో రాణించి లంక విజయంలో కీలక పాత్ర పోషించిన ఫెర్నాండోను ప్రకటించగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ను టీమిండియా యువ కెరటం సూర్యకుమార్ యాదవ్ దక్కించుకున్నాడు.
    Published by:Sambasiva Reddy
    First published: