Sri Lanka vs West Indies | ఊరించి ఓడిన వెస్టిండీస్...శ్రీలంకదే విజయం...

Sri Lanka vs West Indies Live Score, ICC Cricket World Cup 2019 Match at Durham: శ్రీలంక, వెస్టిండీస్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌ ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక విధించిన 339 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ దీటుగా ఎదుర్కొన్నప్పటికీ లక్ష్యానికి సమీపంలో నిలిచిపోయింది.

news18-telugu
Updated: July 1, 2019, 11:41 PM IST
Sri Lanka vs West Indies | ఊరించి ఓడిన వెస్టిండీస్...శ్రీలంకదే విజయం...
twitter
news18-telugu
Updated: July 1, 2019, 11:41 PM IST
Sri Lanka vs West Indies Live Score, ICC Cricket World Cup 2019 Match at Durham: డర్హం వేదికగా జరగుతున్న శ్రీలంక, వెస్టిండీస్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌ ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక విధించిన 339 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ దీటుగా ఎదుర్కొన్నప్పటికీ లక్ష్యానికి సమీపంలో నిలిచిపోయింది. వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ నికోలస్ పూరన్ సెంచరీతో శ్రీలంక బౌలర్లపై మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లభించలేదు.  టార్గెట్ ఛేదనలో వెస్టిండీస్ తొలుత తడబడింది. ఓపెనర్ క్రిస్ గేల్ (35) నిలదొక్కుకునే ప్రయత్నం చేసినప్పటికీ, మరోవైపు నుంచి వికెట్లు పడటంతో వెస్టిండీస్ 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో బ్యాటింగ్ కు దిగిన నికోలస్ పూరన్ సిక్సర్లు, బౌండరీలతో శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతడికి తోడుగా, ఫెబియన్ అల్లెన్(51) బ్యాట్ ఝళిపించడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఫెబియన్ అల్లెన్ కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టడంతో నెమ్మదిగా మ్యాచ్ వెస్టిండీస్ వైపునకు మొగ్గింది. అయితే చివర్లో

ఇదిలా ఉంటే తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఓపెనర్లు కరునరత్నే(32), కుశాల్ పెరిరా(64) శుభారంభం అందించగా తొలివికెట్ కు 93 పరుగులు భాగస్వామ్యం నమోదైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆవిష్క ఫెర్నాండో (104) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి సెంచరీ పూర్తి చేసుకోవడంతో శ్రీలంక స్కోరు 300 దాటింది. లంక బ్యాట్స్‌మెన్లలో కుశాల్ మెండిస్ (39), యాంజిలో మాథ్యూస్ (26) తిరిమన్నే (26) రాణించడంతో లంక భారీ స్కోరు సాధించడంలో సక్సెస్ అయ్యింది. చివరి పది ఓవర్లలో లంక బ్యాట్స్ మెన్ ఏకంగా 80 పరుగులు చేయడం విశేషం. 45వ ఓవర్లో శ్రీలంక 300 పరుగుల మైలురాయిని దాటింది. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 2 వికెట్లు తీయగా, గాబ్రియల్, కాట్రెల్, ఆలెన్ చెరో వికెట్ పడగొట్టారు.

First published: July 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...