HOME »NEWS »SPORTS »sri lanka used an extra fielder in galle test icc comes up funny tweet srd

ICC : 12 మందితో బరిలోకి దిగిన శ్రీలంక.. ఐసీసీ సీరియస్..ఆ ప్లేయర్ ఎవరంటే...

ICC : 12 మందితో బరిలోకి దిగిన శ్రీలంక.. ఐసీసీ సీరియస్..ఆ ప్లేయర్ ఎవరంటే...
Photo Credit : Twitter

ICC : గాలె వేదికగా శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ని 2-0తో ఇంగ్లాండ్ క్లీన్‌స్వీప్ చేసేసింది. అయితే ఈ టెస్ట్ లో శ్రీలంక 12మంది ఆటగాళ్లతో బరిలోకి దిగింది. ఫలితంగా ఐసీసీ రంగంలోకి దిగింది. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని బదులిచ్చింది. అదేంటి మైదానంలో 11 మందితోనే కదా అడుగు పెడతారు? లంకేయులకు ఆ మాత్రం తెలియదా అనుకుంటున్నారా?

  • Share this:
    గాలె వేదికగా శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ని 2-0తో ఇంగ్లాండ్ క్లీన్‌స్వీప్ చేసేసింది. సోమవారం ముగిసిన రెండో టెస్టులో 164 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ టీమ్.. డొమినిక్ సిబ్లీ (56 నాటౌట్: 144 బంతుల్లో 2x4), జోస్ బట్లర్ (46 నాటౌట్: 48 బంతుల్లో 5x4) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో 6 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. ఇటీవల ముగిసిన తొలి టెస్టులోనూ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. అయితే ఈ టెస్ట్ లో శ్రీలంక 12మంది ఆటగాళ్లతో బరిలోకి దిగింది. ఫలితంగా ఐసీసీ రంగంలోకి దిగింది. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని బదులిచ్చింది. అదేంటి మైదానంలో 11 మందితోనే కదా అడుగు పెడతారు? లంకేయులకు ఆ మాత్రం తెలియదా అనుకుంటున్నారా? అయితే మీరే ఓ లుక్కేయండి. గాలె వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ కు అనుకోని అతిథి వచ్చాడు.ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా ఉడుము తరహాలో ఉండే ఓ జంతువు బౌండరీ సరిహద్దు వద్దకు వచ్చి నిలబడింది. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్నట్టుగా అనిపించింది. టీవీ తెరలపై కనిపించిన ఈ దృశ్యాన్ని నెటిజన్లు ట్విటర్లో వైరల్‌ చేశారు. దీనిపై ఐసీసీ సెటైర్ విసిరింది. లంక ఎక్స్ ట్రా ఫీల్డర్‌ను మోహరించిందని సెటైర్‌ వేసింది.


    "గాలెలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఇవాళ్టి పోరులో లంక అదనపు ఫీల్డర్‌ను మోహరించిందన్న వార్తలను ఐసీసీ సమీక్షిస్తోంది. పరిస్థితులను పర్యవేక్షిస్తాం" అంటూ ఐసీసీ ట్వీట్‌ చేసింది. మరోవైపు శ్రీలంకపై ఇంగ్లాండ్‌ గ్రాండ్ విక్టరీ సాధించింది. 6 వికెట్ల తేడాతో రెండో టెస్టులో గెలుపొందింది. తొలుత లంక 381 పరుగులు చేయగా ఇంగ్లాండ్‌ 344 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో లంకను 126కే ఆలౌట్‌ చేసింది ఇంగ్లిష్‌ జట్టు. ఆ తర్వాత చిన్న టార్గెట్ ను రూట్‌ సేన సునాయసంగా ఛేదించింది. ఈ మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్‌ 186 పరుగులు చేయడం చేశాడు. ఫస్ట్ టెస్ట్ లో డబుల్ సెంచరీని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు రూట్. ఈ ప్రదర్శనతో జో రూట్ కి మ్యాన్ ఆఫ్ ది సీరిస్ అవార్డు దక్కింది.
    Published by:Sridhar Reddy
    First published:January 25, 2021, 20:33 IST